ఆంధ్రప్రదేశ్‌

ఆర్ అండ్ బిలో అక్రమ పదోన్నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 5: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బి)లో అక్రమ పదోన్నతులు ఆ శాఖను కుదిపేస్తున్నాయి. సీనియర్లను కాదని జూనియర్లకు పదోన్నతులు కల్పించడం కలకలం రేపుతోంది. జోన్లవారీగా సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఆ ఆదేశాలను తుంగలోతొక్కి, యథేచ్ఛగా అక్రమ పదోన్నతులు కల్పించారని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి పదమూడు జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించారు. జోన్-1లో శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలు, జోన్-2లో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు, జోన్-3లో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలు, జోన్-4లో చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలున్నాయి. నాల్గవ జోన్‌కు సంబంధించిన జూనియర్ ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించి, మిగిలిన జోన్లలో వారికి పోస్టింగులు ఇచ్చేశారు. దీనితో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు జోన్ల ఇంజనీర్లు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. సీనియార్టీ ప్రకారమే అన్ని జోన్లలో పదోన్నతులు కల్పించాలని సుప్రీం కోర్టు ట్రిబ్యునల్ ఒ ఎ 1614బై 2012 ప్రకారం 2013 డిసెంబర్ 11వ తేదీనే ఆదేశాలు జారీచేసింది. కానీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమ పదోన్నతులు కొనసాగించారని నష్టపోయిన మూడు జోన్ల ఇంజనీర్లు ఆందోళనపథంలోకి దిగారు. ఒక అధికారి ఇఎన్‌సిగా ఉన్నపుడు ఈ వివాదాస్పద పదోన్నతులకు తెరలేచింది. నాల్గవ జోన్‌కు చెందిన జూనియర్లకు పదోన్నతులు కల్పించారు. అయితే ఆ ఇఎన్‌సిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో అప్పట్లోనే ఆయనను పక్కనబెట్టినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన డిప్యూటీ సెక్రటరీ కూడా అదే పంథాను అనుసరించి అక్రమ విధానంలో పదోన్నతులు కల్పించారు. 35 మంది ఇంజనీర్లకు అక్రమంగా పదోన్నతులు కల్పించారని ఆరోపిస్తున్నారు. జోన్-4 డిఇలుగా పనిచేస్తున్న జూనియర్ అధికార్లకు ఇఇలుగా పదోన్నతి కల్పించి, మిగిలిన మూడు జోన్లలో పోస్టింగులిచ్చారు. దీంతో 1, 2, 3 జోన్లలో 35 ఏళ్ల సీనియార్టీ ఉన్న పలువురు డిఇలు అదే పదవిలో పదవీ విరమణ చేయాల్సివస్తోందని, కనీస ఇంక్రిమెంట్లు కూడా లేకుండా పోయాయని మూడు జోన్ల ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. అన్ని జోన్లలో 42 మంది డిఇలు వుంటే అందులో 35 మంది ఇఇలుగా పదోన్నతులు పొందినవారు జోన్-4కు చెందినవారే ఉన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.