ఆంధ్రప్రదేశ్‌

సముద్ర స్నానం చేస్తూ ముగ్గురు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్తూరు, అక్టోబర్ 5: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లోబుధవారం సముద్రం స్నానం చేస్తూ, అలల తాకిడికి నీట మునిగి ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మొగల్తూరు పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి... భీమవరం ప్రాంతానికి చెందిన 12మంది విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం పేరుపాలెం బీచ్‌కు వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విద్యార్థులంతా స్నానానికి సముద్రంలోకి దిగారు. వీరిలో భీమవరం రూరల్ మండలం గూట్లపాడు గ్రామానికి చెందిన కారుమూరి సాయి తేజ్(19), రేవు రాజేష్(17), కృష్ణా జిల్లా కలిదిండి గ్రామానికి చెందిన మంతెన భానుప్రకాష్(23) అలల తాకిడికి నీట మునిగిపోయారు. సహచరులు గమనించేలోగానే సాయితేజ్, రాజేష్ మృతచెందారు. నీట మునిగిపోతున్న భానుప్రకాష్‌ను స్థానికులు రక్షించి, ఒడ్డుకుచేర్చారు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని 108 వాహనంలో నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. వీరిలో రాజేష్ భీమవరం డిఎన్నార్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా, మిగిలిన ఇద్దరు అదే కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుప్రతికి తరలించారు. మొగల్తూరు పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.