ఆంధ్రప్రదేశ్‌

ఇన్‌పుట్ సబ్సిడీ ఎక్కడిచ్చారో నిరూపిస్తే రాజకీయ సన్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 5: వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజ మెత్తారు. బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ప్రకటించి ముఖ్యమంత్రి, మంత్రులు చేతులు దులుపుకుంటున్నారని, రైతులకు ఏ మాత్రం అందలేదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్తున్నట్లుగా ఏ ఒక్క రైతుకైనా ఇప్పటి వరకు ఇన్‌పుట్ సబ్సిడీ అందినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బొత్స స్పష్టం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం కెకెఆర్ ఫంక్షన్ ప్లాజాలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ జిఎంసి ఎన్నికల్లో గెలవలేమనే భయంతో అధికార పార్టీ 50వేల ఓట్లను తొలగించిందని ఆరోపించారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అదేమని ప్రశ్నిస్తే దురాగతాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్‌లో చక్కర్లుకొట్టి వరద బాధితులకు మొండిచేయి చూపారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటనతోనే ప్రభుత్వం దిగివచ్చి మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ఎంపి మిధున్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే ముస్త్ఫా, మాజీ ఎమ్మెల్యేలు సుచరిత, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో అధికార పార్టీ భూ దందా
విశాఖపట్నం: విశాఖ నగరం నడిబొడ్డున భూ దోపిడీకి అధికార పార్టీ నాయకులు తెరతీశారని, రూ.1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో దక్కించుకునేందుకు సిఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ రంగం సిద్ధం చేశారని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ భూమిగా నిర్ధారించి గెజిట్ జారీ చేయగా, టిడిపి బినామీలు తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. విశాఖ నగరంలో అత్యంత ఖరీదైన దసపల్లా హిల్స్‌లో సర్వేనెంబర్ 1196,1197,1027,1028లో సుమారు 65 ఎకరాల భూమిపై వివాదాలున్నాయని పేర్కొన్నారు. ఈ భూమిలో 30 ఎకరాలను సేకరించిన విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) లేఅవుట్ వేసి ఇళ్ల ప్లాట్‌లను విక్రయించిందన్నారు. మిగిలిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉందన్నారు. ఈ భూములపై రాణి కమలాదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. అనంతరం ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం సరిగా స్పందించకపోవడంతో ఎక్స్‌పార్టీకి డిక్రీ ఇచ్చిందన్నారు.