ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రాలో 85వేల బెల్ట్‌షాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం చేసిన రోజున తొలి ఐదు సంతకాల్లో ఉన్న బెల్ట్‌షాపుల రద్దు ఆచరణలో విఫలమైందని వైకాపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. గురువారం ఇక్కడ వైకాపా శాసనసభాపక్ష ఉపనేత విశే్వశ్వరరెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో 85 వేల బెల్ట్‌షాపులు ఉన్నాయని, వీటిని మూసివేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదన్నారు. మద్యం అమ్మకాల కోసం ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం లక్ష్యాలు ఇస్తోందన్నారు. మద్యం అమ్మకాలకు లైసెన్సు షాపు ఒకటి ఉంటే అనుబంధంగా వందల బెల్ట్‌షాపులు పుట్టుకొస్తున్నాయన్నారు. మద్యంపై ఉన్న విజన్ చంద్రబాబుకు మంచినీటి సరఫరాపై లేదని వారు విమర్శించారు. మద్యం నియంత్రణ చేస్తామని చెప్పిన చంద్రబాబు డిస్టలరీల విస్తరణకు ఎందుకు అనుమతులు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి రేటు 12.5 శాతం ఉండగా, మద్యం అమ్మకాలపై ఆధారపడడం ఎందుకని వారు నిలదీశారు. ప్రత్యేక హోదా తీసుకురాకపోయినా ప్రతిపక్షపార్టీలపై ఎదురుదాడి ఎలా చేయాలో టిడిపి శిక్షణ శిబిరంలో క్లాసులు ఇస్తున్నారన్నారు. టిడిపి ప్రారంభించబోయే జనచైతన్య యాత్రలలో గత రెండున్నరేళ్లలో ఏం సాధించారో, ఐదు సంతకాల అమలుపై ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. విభజన చట్టంలోని హామీలను కూడా రాబట్టుకోలేని పరిస్థితుల్లో చైతన్య యాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సిఎం కోర్‌డ్యాష్ బోర్డులో అన్నీ కనిపిస్తున్నాయని, లిక్కర్ షాపుల నుంచి నెల నెల తీసుకుంటున్న ముడుపులు సిఎం కోర్ డ్యాష్‌లో కనిపించడం లేదా అని ప్రశ్నించారు.