ఆంధ్రప్రదేశ్‌

కేసుల విచారణపై పోలీస్ అకాడమిలో శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: పోలీసులు కేసుల విచారణలో సుశిక్షితులవ్వాలని, శిక్షణతోపాటు వృత్తి నైపుణ్యతను మెరుగుపరచుకోవాలని ఆర్‌బివిఆర్‌ఆర్ డైరెక్టర్ జనరల్ దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమిలో రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ అకాడమిల సంయుక్త్ధ్వార్యంలో జరుగుతున్న శిక్షణ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల నుంచి సదస్సుకు వచ్చిన పోలీస్ అధికారులు అవగాహనతో ఆయా ప్రాంతాల్లో మంచి అధికారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. అదనపు డైరెక్టర్ ఎంకె సింగ్ తెలంగాణ పోలీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్ మ్యాప్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పోలీస్ వ్యవస్థ, అత్యాధునిక టెక్నాలజీ వినియోగం, స్మార్ట్ సిటీ, పిటిషన్ మానిటరింగ్, క్యాష్‌లెస్ చలాన్లు, బాడి వోర్న్ కెమెరాలు, షీ క్యాబ్స్, హాక్ ఐ , పాస్‌పోర్టుల వెరిఫికేషన్ అప్లికేషన్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.