ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో ఎల్‌ఇడి వీధి దీపాల పర్యవేక్షణ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: ఆంధ్ర రాష్ట్రంలో ఎల్‌ఇడి వీధి దీపాల వ్యవస్ధను పర్యవేక్షించేందుకు కేంద్రీకృత నియంత్రణ మానిటరింగ్ వ్యవస్ధను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పారు. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఈ నెల 7,8 తేదీల్లో గుజరాత్‌లోని వడోదరాలో జరిగే ఇంధన సంరక్షణ సదస్సులో కేంద్రం ఆహ్వానం మేరకు రాష్ట్రం నుంచి విద్యుత్ నిపుణుల బృందం వెళుతోంది. రాష్ట్రంలో ఎల్‌ఇడి బల్బులను అమర్చడంలో విజయాలు సాధించేందుకు అమలు చేసిన ప్రణాళికను ఈ సదస్సులో ఏపి బృందం వివరిస్తుంది. ఈ బృందానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నాయకత్వం వహిస్తారు.
విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించడం, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా ఎల్‌ఇడి టెక్నాలజీని రూపొందించడం, ప్రజలను భాగస్వామ్యం చేయడం, వినియోగదారులపై ఈ బల్బులకు సంబంధించి ఆర్థిక భారాన్ని తగ్గించడమనే మూడు అంశాలతో ఏపి ప్రణాళిక ఖరారు చేసిందని అజయ్ జైన్ తెలిపారు. ప్రపంచం మొత్తం మీద లాస్ ఏంజిల్స్ నగరంలో 1.41 లక్షల ఎల్‌ఇడి బల్బులు ఉన్నాయని, విశాఖపట్నంలో 96 వేల ఎల్‌డిడి బల్బులు అమర్చినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద 5.5 లక్షల ఎల్‌ఇడి బల్బులు అమర్చడమనేది ప్రపంచ రికార్డు అని అజయ్ జైన్ తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రలో విద్యుత్ పరిస్థితిని రియల్ టైం పవర్ మానిటరింగ్ వ్యవస్ధ ద్వారా గుర్తిస్తున్నట్లు ఆయన చెప్పారు.