ఆంధ్రప్రదేశ్‌

17 వరకు తమిళనాడుకు కావేరి నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, అక్టోబర్ 6: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 17వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రానికి కావేరి నదీజలాలు విడుదల చేయనున్నట్లు కర్నాటక రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ్ తెలిపారు. గురువారం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, తమిళనాడు, కర్నాటక ప్రజలు ఎవరూ కావేరి జలాల కోసం ఘర్షణలు జరగాలని కోరుకోవడం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీటిని సరఫరా చేస్తే తమ రాష్ట్ర రైతులకు వ్యవసాయానికి, తాగడానికి నీరు దొరకదని, అందుకే నీటి సరఫరా చేయడం జరగదని చెప్పామన్నారు. గత రెండేళ్ళుగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో డ్యాంలోకి నీరు చేరలేదన్నారు. దీంతో నీటి విడుదలలో ఆలస్యం జరిగిందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 17 వరకు నీటిని విడుదల చేస్తామని, ఆ తరువాత బోర్డు దృష్టికి తమ సమస్య తీసుకువెళ్లి నీటి విడుదల నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గడినాడు ప్రాంత ప్రజలకు అన్ని సౌకర్యలు కల్పించేందుకు కర్నాటక ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు రాకపోవడంతో అమలు చేయలేక పోతున్నామన్నారు. కర్నాటక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల మూలంగా ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయని, 110 నియోజకవర్గాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కరవు నివారణ చర్యలు చేపట్టడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.