ఆంధ్రప్రదేశ్‌

సంతకాలు చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (గోపాలపట్నం), అక్టోబర్ 6: గల్లంతైన ఎయిర్‌ఫోర్స్ విమానం ఎఎన్ 32తో పాటు తమవారి జాడ తెలియక గత మూడు నెలలుగా మానసిక క్షోభకు గురైన ఎన్‌ఎడి ఉద్యోగుల కుటుంబాలను ఉన్నతాధికారులు ఒక్కసారిగా నైరాశ్యంలోకి నెట్టేశారు. వైమానిక విమానంలో గల్లంతైన తమ వారు ఎక్కడో క్షేమంగా ఉంటారని ఆశతో ఉన్న కుటుంబ సభ్యులకు ఇకపై ఆశలు వదులుకోవాలని, మరణించినట్లుగా అంగీకరిస్తూ నో అబ్జక్షన్ పత్రాలపై సంతకాలు చేయాలంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బాధిత కుటుంబీకులు తమకు కచ్చితమైన సమాచారం ఇచ్చే వరకు పత్రాలపై సంతకాలు చెయ్యమని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని లక్ష్మీనగర్‌కు చెందిన ఎన్‌ఎడి ఉద్యోగి నాగేంద్ర కుటుంబ సభ్యులు, బుచ్చిరాజుపాలేనికి చెందిన ఆర్ చిన్నారావుకుటుంబ సభ్యులను గురువారం సాయంత్రం ఆరాతీయగా ముందు పత్రాలపై సంతకం చేస్తే కచ్చితమైన సమాచారం, పరిహారంపై స్పష్టత ఇస్తామని ఉన్నతాధికారులు అంటున్నారని చెప్పారు.