ఆంధ్రప్రదేశ్‌

ఏటికొప్పాక సుగర్స్ తరలింపునకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిరూరల్, అక్టోబర్ 6: విశాఖ జిల్లా రూరల్ అనకాపల్లి పరిధి తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ మూసివేత దిశగా వెళ్తోంది. ఇక్కడకు వచ్చే చెరకును సమీపంలోని ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీకి తరలించాలని రాష్ట్ర సుగర్స్ డైరక్టర్ నుండి ఈ మేరకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో కార్మికులు, రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కార్మికుల పిఎఫ్ ఫండ్‌ను యాజమాన్యం వాడుకోవడంతో కనీసం మొలాసిస్ అమ్మకం ద్వారా వచ్చిన 50 లక్షల రూపాయలను పిఎఫ్ ఫండ్‌కు ఇప్పటికీ జమ చేయలేదు. కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లోకి పిఎఫ్‌ను జమచేస్తే 15 నుండి 20 వేల వరకు వస్తాయనుకున్న కార్మికుల ఆశలు నెరవేరలేదు. 4 కోట్లకు పైగా కార్మికులకు, రైతులకు బకాయి ఉన్న ఈ ఫ్యాక్టరీ ఈ ఏడాది క్రషింగ్ నిలపడంతో పాటు మూసివేత దిశగా కూడా ఉన్నట్లు కార్మికులు, రైతులు ఆందోలన చెందుతున్నారు. దీంతో 170 మంది కార్మికులు రోడ్డున పడనున్నారు.