ఆంధ్రప్రదేశ్‌

దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే గుదిబండి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లిపర, అక్టోబర్ 6: ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజకీయ దురంధరుడు, నాలుగుసార్లు గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం నుండి ఎన్నికైన మాజీ శాసనసభ్యుడు గుదిబండి వెంకటరెడ్డి (74) గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రజల సందర్శనార్థం గుదిబండి పార్థివదేహాన్ని కొల్లిపరలోని స్వగృహంలో ఉంచారు. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యేలు రాయపాటి శ్రీనివాస్, మేకతోటి సుచరిత సంతాపం తెలిపారు.