ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మన్యంలో కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, గూడెంకొత్తవీధి, అక్టోబర్ 6: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలంలో బుధవారం సాయంత్రం మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాల మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈసంఘటనలో ముగ్గురు మావోయిస్టులకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడెంకొత్తవీధి మండలంలోని పెదపాడు, కుంకుపూడి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో గ్రేహౌండ్స్ బలగాలు ఆప్రాంతంలో గత నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఎట్టకేలకు బుధవారం సాయంత్రం మావోల జాడను పోలీసు బలగాలు కనిపెట్టగలిగాయి. పోలీసుల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. పోలీసులు కూడా వారిపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య అర గంటకు పైగా ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటన జరిగిన ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులు గాయపడ్డారని వీరిలో గాలికొండ డిప్యూటీ కమాండర్ గెమ్మిలి నర్సింగ్, దళ సభ్యుడు గెమ్మలి నరసింగ్, సాగులు, మరో మిలీషియా సభ్యుడు మువ్వల ఆంబ్రిలు ఉన్నారు. వీరందరిపైన ఒక్కొక్కరికి లక్ష వరకు రివార్డు ఉంది. గాయపడిన మావోయిస్టులను హుటాహుటినా జి.కె.వీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేసి కెజిహెచ్‌కు తరలించారు. కాగా పెదపాడు అటవీ ప్రాంతంలో మొదట మావోయిస్టులు మందుపాతర పేల్చినట్లు తెలుస్తోంది. ఈసంఘటనలో మావోయిస్టులతో పాటు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. వీరిని బుధవారం అర్ధరాత్రే ఎవరికి తెలియకుండా విశాఖ తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈమందుపాతర సంఘటను పోలీసులు ధృవీకరించలేదు. సంఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున శబ్దం వచ్చిందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
తీవ్రంగా గాయపడిన మావోయిస్టులను వైద్య సేవలకు తీసుకురావడానికి పోలీసులు నానా హైరానా పడ్డారు. గాయాలతో బాధపడుతూ తీవ్రరక్తస్త్రావం అవుతున్న మావోయిస్టులను అటవీ ప్రాంతం నుండి మండల కేంద్రానికి ఎంతో శ్రమకోర్చి తీసుకువచ్చారు. పెదపాడు గ్రామంలో మంచం తీసుకుని సుదూర అటవీ ప్రాంతం నుంచి పోలీసులు స్వయంగా గాయపడిన మావోయిస్టులను 10 కిలో మీటర్లకు పైగా నడిచి కుంకుంపూడి గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడి నుండి సి. ఐ. గోవిందరావు ఆధ్వర్యంలో అంబులెన్స్‌లో విశాఖ కె.జి.హెచ్.కు తరలించారు.
కెజిహెచ్‌కు చేరుకున్న ఎస్పీ
ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మావోయిస్ట్‌లను కెజిహెచ్‌కు తీసుకువచ్చారు. వెంటనే ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కెజిహెచ్‌కు చేరుకుని వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను వాకబు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎదురుకాల్పుల్లో పోలీసులకు ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. సంఘటన స్థలంలో ఒక మందుపాతర, రెండు ఆయుధాలు, రెండు కిట్ బ్యాగులు, మావోయిస్ట్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. మావోయిస్ట్‌లు స్వచ్ఛందంగా లొంగిపోవాలని, అటువంటి వారికి ఎటువంటి హానీ తలపెట్టబోమని ఆయన చెప్పారు. లొంగిపోయిన వారిపై కేసులు కూడా ఉండవని అన్నానరు. వారికి తక్షణ పునరావాసం కల్పిస్తామని అన్నారు. కాగా, ఈ సంవత్సరంలో ఏజెన్సీలో ఎదురు కాల్పులు జరగడం ఇది మూడోసారి.

చిత్రం.. ఎదురు కాల్పుల్లో గాయపడిన మావోయిస్టు
దళ సభ్యుడు ఆంబ్రి, డిప్యూటీ కమాండర్ నర్సింగ్