ఆంధ్రప్రదేశ్‌

త్వరలో మొబైల్ కంట్రోల్ రూం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 6 : రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడమే కాక, ప్రజలకు సేవే లక్ష్యంగా సిబ్బంది పనిచేసేలా సంస్కరణలు అమలుచేస్తున్నట్లు రాష్ట్ర డిజిపి ఎన్ సాంబశివరావు తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో త్వరలో మోడల్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుతో పాటు డిజిటల్ వాచ్‌కు సన్నాహాలుచేస్తున్నామన్నారు. అలాగే మొబైల్ కంట్రోల్ రూం ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో డిజిపి సాంబశివరావు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులు, సంస్కరణలను వివరించారు. ఇటీవల పుష్కరాల నిర్వహణలో పోలీసు వ్యవస్థ సమర్ధంగా వ్యవహరించిందని, అలాగే తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రశంసనీయమైన సేవలు అందిస్తున్నారన్నారు. పుష్కరాల సందర్బంగా విస్తృతంగా ఏర్పాటుచేసిన సిసి కెమెరాలు, కంట్రోలు రూం ఏర్పాటువల్ల కలిగిన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూ మొబైల్ కంట్రోల్ రూం ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. దీనికి తగిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయన్నారు. పుష్కరాల సందర్భంగా సిసి కెమెరాల ఏర్పాటుకు వారాల ముందు నుంచి ఏర్పాట్లు చేశామని, అయితే మొబైల్ కంట్రోల్ రూమ్ సిద్ధమైతే రాష్ట్రంలో ఎక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు, జాతరలు జరిగినా ఆ ప్రాంతాలకు మొబైల్ కంట్రోల్ రూమ్ ముందుగానే చేరుకుని రోజుల వ్యవధిలో అవసరమైన చోట్ల సిసి కెమేరాలను ఏర్పాటుచేసి ఆ ఉత్సవాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలా చేయడానికి వీలవుతుందన్నారు. దీనితోపాటు ఇటీవల కాలంలో ఆందోళనలు జరిగిన సమయాల్లో చోటు చేసుకునే ఘటనలపై పోలీసులపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఇటువంటి పరిస్థితుల్లో నిజానిజాలను నిర్ధారించడానికి డిజిటల్ వాచ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ విధానం విదేశాల్లో మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. దీనిలో ఆయా ఆందోళనల సందర్భంగా బందోబస్తుకు వెళ్లే అధికారులకు బాడీ ఓన్ కెమేరాలను అమరుస్తామని, దానివల్ల అక్కడ జరిగిన ఘటనలు, అధికారి మాట్లాడిన తీరు, ఎదుటి పక్షం వ్యవహరించిన తీరు వంటివి పూర్తిగా రికార్డు అవుతాయన్నారు. రాష్ట్రంలో మోడల్ పోలీసుస్టేషన్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రస్తుతం నాలుగు పోలీసుస్టేషన్లను మోడల్‌గా తీర్చిదిద్దుతున్నామని, రానున్న రోజుల్లో వంద పోలీసుస్టేషన్లను మోడల్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటన విషయంలో సరైన సమయంలో సిఐడి సరైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఇ- ఆఫీస్ విధానం అమలులో రాష్ట్రంలోనే ముందంజలో వుందని చెప్పారు.