ఆంధ్రప్రదేశ్‌

రబీకి ప్రత్యేక ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో రబీకి వ్యవసాయ ప్రణాళిక సిద్ధమైంది. ఈనెల 15వ తేదీతో ఖరీఫ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రబీకి లక్ష్యాలను నిర్దేశించారు. శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవనశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌లో 43 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు గాను 40 లక్షల హెక్టార్లను లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 38లక్షల హెక్టార్లు మాత్రమే పూర్తయిందని మంత్రి మీడియాకు వివరించారు. మిగిలిన ఆయకట్టును రబీలో సాగుచేయడం ద్వారా లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగా రైతులకు సకాలంలో విత్తనాలు, నేల స్వభావ నిర్ధారణ పత్రాలను త్వరితగతిన అందజేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలతో పాటు డెల్టాలో నీటి ఎద్దడి కారణంగా ఎండిపోయిన పంట పొలాల రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామన్నారు.
నకిలీ విత్తనాలు, బయో ఫర్టిలైజర్స్ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. హైబ్రిడ్ సీడ్స్ విక్రయించే వారికి ఆర్‌ఎస్‌డి తప్పనిసరన్నారు. ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగుచేశారో, ఏ బ్యాచ్‌లో ఎన్ని కన్‌సైన్‌మెంట్‌లు ఉన్నాయనే వివరాలను దిగుబడులతో సహా వ్యవసాయ శాఖకు అందించిన తరువాతే అనుమతిస్తామని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయించే వారిపై పిడి యాక్టును అమలు చేసేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ప్రైవేటు న్యాయవాదులను నియమించి జిల్లాల వారీగా నియంత్రణ చర్యలు చేపడతామని వివరించారు.