శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సిఎం సమక్షంలో సోమిరెడ్డి జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, మార్చి 26: తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 60వ జన్మదిన వేడుకలను శనివారం హైదరాబాద్‌లోని శాసనమండలిలోని సిఎం కార్యాలయంలో కేక్‌ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేక్ కట్‌చేసి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ఉద్యమాలలో, ప్రజా ఆందోళనలో కీలకభూమిక పోషించిన ఘనత సోమిరెడ్డికే దక్కుతుందన్నారు. జాతీయస్థాయిలో సోమిరెడ్డి సేవలు పార్టీకి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యాక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరసా రత్నం, కన్నబాబు, బల్లి దుర్గాప్రసాద్, డాక్టర్ జడ్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బంగారు తల్లికి భవిష్యత్ లేదా?
- భరోసా కోల్పోతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు
మార్టూరు, మార్చి 26: ప్రభుత్వం మారినప్పుడల్లా పలు పథకాలు సరికొత్త పేరును సంతరించుకుంటాయి. మార్పులు చేర్పులంటూ అనివార్యం అవుతుంటాయి. వీటికి జాప్యం తోడయితే అయోమయ పరిస్థితులు వెంటాడుతాయి. పేద కుటుంబాల్లోని బాలికలను ఆదుకునేందుకు గతంలో బాలిక సంరక్షణ, బంగారు తల్లితో పాటు తాజాగా మా ఇంటి మహాలక్ష్మి పధకాలు పలు రకాల పేర్లతో వస్తున్నా ఉద్ధేశించిన ప్రయోజనం సాకారం కాకపోవడం గమనార్హం. 2013 మే 1వ తేదీన తెల్లకార్డు ఉన్న కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలకు అండగా ఉండేందుకు ఉద్ధేశించి బంగారు తల్లి పధకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాని 2015 జులై వరకు మాత్రమే నమోదు జరిగింది.
ఆపై వచ్చిన ధరఖాస్తులన్నీ కార్యాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్నాయి. నమోదైన వాటికి తరువాత విడత చెల్లింపులు కరువయ్యాయి.
ఇదీ పధకం తీరు : ఆడపిల్ల పుట్టింది మొదలు డిగ్రీ పూర్తి చేసే వరకు ఏటా కొంతమేర మొత్తంగా రూ.2లక్షల 16వేల చొప్పున చెల్లించడం ఈ పధకం ఉద్ధేశం. ఆడపిల్ల పట్టగానే పేరు నమోదు చేసిన వెంటనే రూ.2500 బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఆపై ఏటా నిర్ధేశించిన మేర 1 నుంచి 2 ఏళ్ల వరకు టీకాల నిమిత్తం సంవత్సరానికి రూ.వెయ్యి, 3 నుంచి ఐదేళ్ల వరకు అంగన్‌వాడి కేంద్రాల్లో పేరు నమోదు చేసి పంపితే ఏటా రూ.1500, 1 నుంచి ఐదో తరగతి వరకు ఎంపిపి పాఠశాలలో చదివితే ఏటా రూ.2వేలు, 6 నుంచి 8 తరగతి వరకు ఏటా రూ.2,500, 9 నుంచి పదో తరగతి వరకు రూ.3వేలు, ఇంటర్‌లో ఏటా రూ.3,500, డిగ్రీలో ఏటా రూ.4,500 ఖాతాలో జమ అవుతాయి. ఇలా మొత్తం రూ.2లక్షల 16వేలు జమ కావాలి. కానీ 2015 జులై లోపు దరఖాస్తు చేసుకున్న 150 మందికి మొదటి విడత రూ.1500 జమ కాగా తరువాత బంగారు తల్లికి దరఖాస్తు చేసుకున్న 95 మందికి అర్హుల ఖాతాలో నగదు జమ కాలేదు. ఈ పధకం ఐకెపికి వర్తిస్తుందో, ఐసిడి ఎస్‌కి వర్తిస్తుందో రెండు శాఖల అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు ఈ పధకం ద్వారా ధైర్యంగా ఉన్నప్పటికీ ఈ పధకం మరుగున పడిపోతుందేమోనని గాబరా పడుతున్నారు. కాని ఇప్పటి వరకు ఐసిడిఎస్ వారు బంగారు తల్లి పధకాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. ఐకెపి వారిని అడిగితే ఐసిడి ఎస్ వారికి దరఖాస్తులు పంపించామని చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆడపిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.