ఆంధ్రప్రదేశ్‌

గండికోటకు నీటి తరలింపును అడ్డుకున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 7: కడప జిల్లాలోని గండికోట జలాశయానికి కృష్ణాజలాలను తరలించేందుకు చేపట్టిన పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. టిబిసిహెచ్‌ఎల్‌సి ఛైర్మన్ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో రైతులు, ప్రజలు తరలివచ్చి పనులను అడ్డుకున్నారు. నీళ్లు వదిలితే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. మైలవరం ప్రాజెక్టులోకి నీరు వదిలిన తరువాతే గండికోటకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం వరకు రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం లింగాపురం వద్ద వున్న గండికోట టనె్నల్ నుంచి గండికోట ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు శుక్రవారం అధికారులు శ్రీకారం చుట్టడంతో స్థానిక ప్రజలు అడ్డుతగిలారు. మైలవరం, గండికోట జలాశయాలకు నీటిని తరలించేందుకు గత ఆదివారం అవుకు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. కృష్ణాజలాలు వరదకాలువ నుంచి ప్రస్తుతం మైలవరం జలాశయంలోకి ప్రవహిస్తున్నాయి. లింగాపురం వద్ద వున్న టనె్నల్ నుంచి గండికోట జలాశయంలోకి నీటిని తరలించేందుకు అడ్డుగా ఉన్న మట్టికట్ట తొలగించేందుకు జెసిబితో పనులు చేపట్టగా విషయం తెలుసుకున్న టిబిసిహెచ్‌ఎల్‌సి చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరుకు చెందిన వేలాది మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. తాగునీటి అవసరాల దృష్ట్యా మైలవరం జలాశయానికి అవసరమైనన్ని నీటిని తరలించాకనే గండికోటకు నీళ్లు మళ్లించాలని శ్రీనివాసులురెడ్డి అధికారులకు సూచించారు. మట్టికట్ట తొలగిస్తే ఎక్కువ నీరు గండికోట జలాశయానికి చేరుకుంటుందని దీంతో మైలవరంలోకి నీటి ప్రవాహం తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా మట్టికట్ట తొలగించే పనులు చేపట్టడంతో శ్రీనివాసులురెడ్డి ఒక్కసారిగా వరద కాలువలోకి దూకారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనను బయటకు తీసుకువచ్చారు. పురుగుల మందు తాగి సామూసిక ఆత్మహత్యలు చేసుకుంటామని అక్కడే ఉన్న వందలాది మంది రైతులు హెచ్చరించారు. జమ్మలమడుగు అర్బన్ సిఐ శ్రీనివాసులు, అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గండికోట జలాశయంలోకి రెండు పైపుల ద్వారా నీటిని మళ్లించేందుకు అంగీకరించడంతో రైతులు శాంతించారు.