ఆంధ్రప్రదేశ్‌

చిత్తు చేసిన విత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 7: ఖరీఫ్ సీజన్‌లో రైతులు విత్తుతోనే చిత్తయ్యారు. కోస్తా నేలల్లో కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త వరి వంగడం ఖరీఫ్ రైతును దగా చేసింది. రికార్డు స్థాయి దిగుబడులు అందిస్తుందనుకున్న విత్తనం కాస్తా కేళీ అని తేలడంతో అధికారులు అవాక్కయ్యారు. ప్రకృతి వైపరీత్యాలను, చీడపీడలను తట్టుకుంటుందని, ఈదురు గాలులకు ఒరిగిపోకుండా ఉంటుందని ఈ ఖరీఫ్ సీజన్ నుంచి కోస్తా నేలలకు ఆర్‌సి బయో-226 అనే కొత్త వరి వంగడాన్ని అందుబాటులోకి తెచ్చారు. రైతులంతా ఆర్‌సి బయో -226 అనే రకాన్ని వేశారు. నేషనల్ సీడ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సరఫరా అయిన ఈ విత్తనంలో భారీ ఎత్తున కల్తీ జరగడంతో కేళీ అయిందని గుర్తించారు. ఈ విత్తనం శాస్తప్రరంగా సరైనదే అయినప్పటికీ కల్తీ జరగడంతోనే కేళీ అయిందని చెబుతున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఈ విత్తనాల్లో కావాలనే కల్తీ జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి దాదాపు లక్ష ఎకరాల్లో సాగుచేసింది కేళీ విత్తనం అని ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. ఇప్పటికే శాస్తవ్రేత్తలు క్షేత్రాల్లో గుర్తించి ప్రాధమిక నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 4.82 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఖరీఫ్ సాగు చేయగా అందులో రాజమహేంద్రవరం రూరల్, జగ్గంపేట, గొల్లప్రోలు, పిఠాపురం, యు.కొత్తపల్లి, బిక్కవోలు, రాయవరం, పెదపూడి తదితర మండలాల్లో ఈ విత్తనాన్ని వేశారు. ఈ మండలాల్లో దాదాపు 60 శాతం వరకు కేళీ అని తేలింది. వాస్తవానికి ఖరీఫ్ చాలా చోట్ల ఈ నెలాఖరుకు కోతకు రావాల్సి వుంది. ఈ తరుణంలో కేళీ బయటపడ్డంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కేళీ వచ్చిన వరిలో కంకులు మాత్రం కన్పిస్తున్నాయి. వెన్నులన్నీ తాలు వడ్లతో వున్నాయి. ఏపుగా పెరిగిపోయింది. పచ్చగడ్డిగా కోయడం తప్ప మరో గత్యంతరం లేదు. దీనివల్ల ఎకరానికి రూ.40 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులు లబోదిబోమంటున్నారు. నేషనల్ సీడ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ విత్తనం లాట్ నెంబర్ 15-36-06 డబ్ల్యు ఆర్ 835తో వరంగల్ జిల్లా మద్దికొండ నుంచి వచ్చింది. వాస్తవానికి ఈ ఆర్‌సి బయో 226 అనే కొత్త వంగడాన్ని బిపిటి 5204 సాంబమసూరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సిఫార్సు చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో ఈ ఖరీఫ్ నుంచే అత్యధికంగా వేయించారు. ఈ విత్తనాన్ని ప్రవేశపెట్టేందుకు కిలోకు రూ.5 చొప్పున 30 కేజీల విత్తనానికి రూ.150 సబ్సిడీ ఇచ్చారు. ఆకు ఎండు తెగులు రాదని, ఒరిగిపోకుండా అత్యధిక దిగుబడి ఇస్తుందని రైతులను దారుణంగా దగా చేసింది.

చిత్రం.. గింజలేని తాలు కంకులు