ఆంధ్రప్రదేశ్‌

‘కుల’కాలం ఉండాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: కుల రాజకీయాలకు కేంద్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ విజయం సాధించేందుకు తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుల ఓటు బ్యాంకులను తయారుచేసుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల్లో విజయాన్ని ప్రభావితం చేసే కొన్ని కులాలపై దృష్టి సారిస్తున్నారు. వారికి నిధులు, కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే ప్రణాళికకు పదును పెడుతున్నారు.
బాబు తొమ్మిదేళ్లు సీఎంగా చేసినప్పుడు కులాలపై ప్రత్యేకించి దృష్టి సారించిన సందర్భాలు లేవు. తాజాగా సిఎం తీసుకునే పలు నిర్ణయాల్లో కులకోణం కనిపిస్తోంది. ఏపిలో ప్రతిదీ కులంతోనే ముడిపడి ఉంటుంది. చరిత్రలో తొలిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసి, 500 కోట్లు కేటాయించారు. ఫలితంగా నిరుపేద బ్రాహ్మణ విద్యార్ధులకు ఉన్నతవిద్యకు అవకాశం ఏర్పడింది. పెళ్లికి ఆర్ధిక సాయం, వేద, ఆగమ విద్యార్ధులకు స్కాలర్‌షిప్పులు, అర్చకులకు సాయం, వారు మృతి చెందితే కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నారు. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న కాపు, బలిజల ఆర్ధికాభివృద్ధి కోసం రామానుజయ చైర్మన్‌గా ఏర్పాటుచేసిన కాపు కార్పొరేషన్ కూడా సత్ఫలితాలిస్తోంది. ఇప్పటికి 145 మంది విద్యార్ధులు స్కాలర్‌షిప్పులతో విదేశీ విద్యకు వెళుతుండగా, ఈ ఏడాది 14,355 మందికి 91 కోట్ల 99 లక్షలు విడుదల చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 17,655 మందికి 64 కోట్ల 44 లక్షలు విడుదల చేశారు. ఏపి వాషర్‌మెన్ కో ఆపరేటివ్ సొసైటీ కింద 6,817 మందికి 16 కోట్ల 98 లక్షలు; ఏపి నారుూ బ్రాహ్మణ సొసైటీ ఫెడరేషన్ కింద 4,493 మందికి 11కోట్ల 15 లక్షలు; ఏపి వడ్డెర కో ఆపరేటివ్ సొసైటీ నుంచి 3120 మందికి 7 కోట్ల 75 లక్షలు; ఉప్పర సొసైటీ నుంచి 1135 మందికిగాను 2 కోట్ల 83 లక్షలు, కృష్ణ బలిజ పూసల సొసైటీ నుంచి 248 మందికి 62 లక్షలు, వాల్మీకి బోయ సొసైటీ నుంచి 3260 మందికి 8 కోట్ల6లక్షలు, కుమ్మర శాలివాహన సొసైటీ నుంచి 5679 మందికి 14 కోట్ల 11 వేల రూపాయలు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కింద 2856 మందికి 7 కోట్ల 11 లక్షలు, మేదర సొసైటీ నుంచి 963 మందికి 2 కోట్ల 40 లక్షలు, క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా 689 మందికి 5 కోట్ల 2 లక్షలు సాయం చేయడం ద్వారా ఆయా కులాలను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇదే వర్గానికి చెందిన పార్టీ నేతలకు ఆయా కార్పొరేషన్లు, సొసైటీల్లో స్థానం కల్పించడం ద్వారా ఆయా కులాలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీ) కార్పొరేషన్‌కు పదను పెడుతున్నారు. నిజానికి బీసీల్లో ఎంబీసీల శాతమే ఎక్కువ. ఈ సంచార జాతులను తనవైపు మళ్లించుకోవడం ద్వారా భారీ స్థాయిలో లబ్ధి పొందవచ్చన్న వ్యూహం కనిపిస్తోంది. అదేవిధంగా అగ్రకులాలను ఆదుకునేందుకు ఓసీ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలన్న యోచన కూడా ఉంది. రెడ్డి, కమ్మ, వైశ్య, క్షత్రియ వర్గాల్లోని పేదలకు లబ్థి చేకూర్చడం ద్వారా వారికి చేరువ కావాలన్న తపన తెదేపా నాయకత్వంలో కనిపిస్తోంది.