ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడులకు స్వర్గ్ధామం అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 8: రాష్ట్రంలో ప్రస్తుతం పారిశ్రామిక ఉత్తేజిత పూర్వకమైన వాతావణం నడుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండంకెల వృద్ధి సాధించే క్రమంలో రెండేళ్లలో అనేక కీలకమైన సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. వృద్ధిరేటు సాధనలో కీలక భూమిక పోషించే పారిశ్రామిక రంగ వికాసానికి అవసరమైన నీరు, భూమి, విద్యుత్ వంటివి నేడు అందించగలుగుతున్నట్లు తెలిపారు. నగరంలోని ఒక హోటల్‌లో భారత పరిశ్రమల దక్షిత ప్రాంత కౌన్సిల్ సమావేశంలో ఆయన పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తూ దక్షిణ భారతదేశ పారిశ్రామిక వేత్తలకు తాము తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలకు ఎంతో అవసరమైన నీటిని అందించేందుకు రాష్ట్రంలో మైక్రో వాటర్ గ్రిడ్‌ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అమరావతి రాజధానిగా ఏపి రాష్ట్రం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో ఉన్న రాష్ట్రాలన్నింటికీ మెరుగైన రవాణా సదుపాయాలు కలిగి ఉందన్నారు. రైలు, రోడ్డు, రవాణాకు సంబంధించి మెరుగైన కనెక్టివిటీని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో విమానయానం కొత్త పుంతలు తొక్కుతోందని, రెండేళ్లలో 65శాతం విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. వీటితో పాటు పరిశ్రమలు ఎంతో ముఖ్యమైన నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలూ అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆప్టిక్ ఫైబర్ కనెక్టివిటిని ఇంటింటికి అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు మరో 8నెలల్లో పూర్తి చేస్తామన్నారు. నాల్గవ దశ పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఇన్‌ఫర్‌మెషన్ టెక్నాలజీను ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్‌తో కలిపి వినియోగించడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 100 ఎకరాల మేర ఇండస్ట్రియల్ టౌన్ షిప్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు మాట్లాడుతూ వాటర్ ఆడిట్ నిర్వహించడం అత్యంత గొప్ప అంశమని, నీటి లభ్యత, స్టోరేజ్, పంపిణీ మధ్య ఖచ్చితమైన అవగాహన ఉండాలని వాటర్ పాలసీను రూపొందించాలని కోరారు.