ఆంధ్రప్రదేశ్‌

మూడడుగుల బీరకాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, అక్టోబర్ 8: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి జంక్షన్ సమీపంలోని జీడిపప్పు ఫ్యాక్టరీ ఆవరణలో మూడు అడుగుల పొడవుతో బీరకాయలు కాస్తున్నాయి. సాధారణంగా బీరకాయలు అడుగు లేక అడుగున్నర పొడవులో ఉంటాయి. ఈ మిల్లు ఆవరణలో గత రెండేళ్లుగా మూడు అడుగులకు పైగా పొడవుతో లావుపాటి బీరకాయలు కాయటంతో వీటిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు వస్తున్నారు. మిల్లు యజమాని మాట్లాడుతూ ప్రత్యేకంగా ఇతర ప్రాంతాల నుండి బీర విత్తనాలను తేవడం, కొత్తగా వేసిన మన్నుపై బీర పాదులను పెంచడం వలన పొడవాటి కాయలు కాస్తున్నాయన్నారు. మూడేళ్లుగా ఇదే విధంగా తమ ఆవరణలో వివిధ రకాల కాయగూరలు పుష్టిగా కాస్తున్నాయన్నారు.