ఆంధ్రప్రదేశ్‌

తెలుగు వర్శిటీలో ముగిసిన దక్షిణ భారత కవయిత్రుల సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: పాత తరం మహిళా కవయిత్రులకు ధీటుగా నేటి తరం మహిళలు కూడా కవితల పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారని శీలా సుభద్రాదేవి పేర్కొన్నారు.
రెండు రోజుల పాటు తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న దక్షిణ భారత కవయిత్రుల సమ్మేళనం శనివారం నాడు ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ఆచార్య సూరేపల్లి సుజాత మాట్లాడుతూ తెలంగాణ మలి దశ ఉద్యమం అనంతరం బతుకమ్మకు మరింత ప్రాశస్త్యం పెరిగిందని చెప్పారు. సమన్వయకర్తగా డాక్టర్ వై రెడ్డి శ్యామల వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం చెన్నై నుండి వచ్చిన శ్రీదేవి, ముంబై నుండి వచ్చిన తురగా జయ శ్యామల, పుణే నుండి వచ్చిన రవీనా చవాన్, చెన్నై నుండి వచ్చిన ప్రవల్లిక, ఎసి గాయత్రి, భివాండికి చెందిన వడ్డేపల్లి అనూష, బెంగళూరు రోహిణి, న్యూఢిల్లీ భ్రమరాంబికలు కవితాగానం చేశారు.
అంతకు ముందు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంతో వేడుకగా బతుకమ్మ పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆచార్య పద్మావతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పాశ్చాత్య పోకడలపై మక్కువ పెంచుకున్న యువత సైతం చక్కటి సంప్రదాయ వస్త్రాలను ధరించి ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొంటున్నారని అన్నారు.