ఆంధ్రప్రదేశ్‌

రూ.6.5 కోట్లు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 9: అందరి ఆర్థిక అవసరాలు తీర్చే బ్యాంకు ఉద్యోగులు తమ ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉంటూ, మరోవైపు ఆదాయాన్ని కూడా అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్న సొసైటీలో దాచుకున్న నగదు గల్లంతయింది. చివరకు సహకార శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టడంతో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిన సంగతి తెలిసింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు 1990లో ఎస్‌బిఐ ఎంప్లారుూస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ప్రారంభించుకున్నారు. ఇతర బ్యాంకుల కంటే అదనంగా వడ్డీ ఇస్తుండడంతో ఈ సొసైటీలో బ్యాంకు ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా నగదు డిపాజిట్ చేశారు. సుమారు 340 మంది ఉద్యోగులు ఉన్న ఈ సొసైటీ 2009లో మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీగా మారింది. ఎన్నికల ద్వారా ఏర్పాటైన పాలకవర్గం ఈ సొసైటీని నడిపిస్తూ వస్తోంది. గతంలో రాష్ట్రంలోనే ఈ సొసైటీకి ఎంతో మంచి పేరుండేది. కాలక్రమేణా సొసైటీలో లాభాలు తగ్గుముఖం పట్టి నష్టాలు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా 2010 నుంచి సొసైటీ నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. కొందరు సభ్యులు ఈ సొసైటీలో అవినీతి జరుగుతోందని, భారీగా నగదు గల్లంతయిందంటూ సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు సహకార రిజిస్ట్రార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన నెల్లూరు డిసిఓ రాజేశ్వరరావు సొసైటీలో ఆడిటింగ్ నిర్వహించాలని జిల్లా సహకార ఆడిట్ అధికారులను ఆదేశించారు. వీరు మూడు నెలలపాటు ఆడిటింగ్ నిర్వహించి సొసైటీలో మొత్తం సుమారు రూ.6.5 కోట్ల మేర అవినీతి జరిగినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. అందులో అధికభాగం సభ్యుల డిపాజిట్ల సొమ్మే ఉంటుందని సమాచారం. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో పలువురు సభ్యులు బ్యాంకుల కంటే ఇక్కడ తమ నగదును డిపాజిట్ చేస్తుండేవారు. అయితే ఆ నగదు సొసైటీ రికార్డుల్లో మాత్రమే కనిపిస్తోందే తప్ప బ్యాంకులో మాత్రం జమకాలేదు. తమ విచారణలో వెల్లడైన విషయాలను ఆడిట్ అధికారులు నివేదిక రూపంలో గుంటూరులోని కో ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు అందజేశారు. ఆయన నెల్లూరు డిసిఓకు సంబంధిత కాపీని పంపిస్తూ వెంటనే నివేదికను ప్రస్తుత పాలకవర్గానికి అందచేసి, త్వరలో జనరల్‌బాడీ సమావేశం ఏర్పాటుచేసి సంబంధిత వ్యక్తుల నుంచి గల్లంతైన నగదును రికవరీ చేయించేలా చూడాలని ఆదేశించినట్లు సమాచారం. రికవరీ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులందరిపై క్రిమినల్ కేసుల నమోదుకు అధికారులు, సొసైటీ పాలకవర్గ సభ్యులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
సిబ్బంది పాత్రపై అనుమానాలు
కోట్ల రూపాయల నగదు డిపాజిట్లను బ్యాంకులో జమ చేయకుండా తమ అవసరాల కోసం కొందరు సొసైటీ ఉద్యోగులు వాడుకున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం. నగరంలోని ఓ మహిళా నేతకు సమీప బంధువైన ఓ వ్యక్తి ఈ సొసైటీలో గుమస్తాగా ఉంటున్నాడు. సదరు వ్యక్తి ఈ నగదు గల్లంతులో ప్రధాన వ్యక్తిగా అధికారులు భావిస్తున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు గుమస్తాలు, అప్పట్లో ఎన్నికైన పాలకవర్గ సభ్యుల హస్తం కూడా ఉందనే ప్రచారం వినిపిస్తోంది. వారికి తెలియకుండా సాధారణ గుమస్తాలు అంత భారీ మొత్తంలో నగదును ఎలా గల్లంతు చేయగలరనేది ఆడిట్ అధికారుల అనుమానం. ఈ స్కాంకు ముఖ్యకారకుడిగా భావిస్తున్న వ్యక్తిని రక్షించేందుకు నగర ప్రముఖులు, రాజకీయనేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు.
సొసైటీలో నగదు గల్లంతు వాస్తవమే
ఎస్‌బిఐ క్రెడిట్ సొసైటీలో నగదు గల్లంతైన విషయం వాస్తవమేనని డిసిఓ డి.రాజేశ్వరరావు వెల్లడించారు. విచారణ పూర్తయింది, మరో రెండు రోజుల్లో వివరాలు తెలియజేస్తామని ఆయన తెలిపారు.