ఆంధ్రప్రదేశ్‌

వచ్చే దసరానాటికి రాజధానికో రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: వచ్చే విజయదశమి నాటికి ఆంధ్ర రాజధాని అమరావతి నగరానికి రూపురేఖలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని దసరా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర జీవన రేఖ పోలవరం నిర్మాణాన్ని 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, అప్పటికి 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపి జెన్కో చేపట్టే ఈ ప్రాజెక్టు 40 నెలల్లోనే పూర్తి చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ వౌలిక సదుపాయాలను కల్పించే ఉద్దేశంతో స్ధానిక వనరుల ఆధారంగా పరిశ్రమలు స్ధాపించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో 2022నాటికి కరెంటు సరఫరా చేస్తామన్నారు. ఇంధన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి 18 వేల మెగావాట్లు చేస్తామన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలను 10.27 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిస్తామన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలు కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందని, రాజధాని లేకుండా ఆదాయ మార్గాలు చూపకుండా విభజనతో ఆంధ్రులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రులు పౌరుషానికి ప్రతీకనీ, పడ్డచోటనే ఎదురొడ్డి నిలబడే తత్వమన్నారు. ప్రపంచ చరిత్రలో తొలిసారి 34వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని, వీరికి ప్లాట్లను ఇచ్చే కార్యక్రమం ఒక కొలిక్కి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన కష్టాలు మనలను వెంటాడుతున్నాయని, ఆర్థిక లోటు, వౌలిక సదుపాయాల లేమి, పారిశ్రామికంగా వృద్ధి చెందని కారణంగా ఉపాధి అవకాశాల కోసం యువత నిరీక్షించాల్సిన దుస్ధితి నెలకొందన్నారు. రోజుకు 22 మిలియన్ల విద్యుత్ లోటు నుంచి మిగులు స్ధాయికి చేర్చామని, విద్యుత్ లోటు చరిత్రలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. సీమాంధ్ర విద్యార్ధులకోసం జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాకరమైన సంస్ధలను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకువస్తున్నామన్నారు. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ద్వారా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఇంటర్‌నెట్‌లో చేరాలని, ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు.