ఆంధ్రప్రదేశ్‌

ఇంద్రకీలాద్రికి జనప్రవాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 9: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి ఆదివారం శ్రీదుర్గాదేవిగా కనకదుర్గమ్మ భక్తకోటికి దర్శనమిచ్చింది. దసరా ఉత్సవాల్లో ఇప్పటివరకు ఏరోజు లేని విధంగా మూలానక్షత్రం రోజు కంటే కూడా అత్యధికంగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. రాత్రి 7 గంటల సమయానికి ఒక లక్షా 50వేల మంది పైగా భక్తులు తరలివచ్చినట్లు ఓ అంచనా. జై కనకదుర్గ.. నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరులు మార్మోగాయి. దుర్గతులను రూపుమాపే దుర్గావతారంతో దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది. అష్టమి తిధి రోజే.. అందుకే ఆ తల్లి దుర్గ అని కీర్తించబడుతున్నది. ఈ అవతారంలో దుర్గమ్మను దర్శించుకుంటే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేవి త్రిశూలం ధరించి సింహ వాహనంపై అధిష్టించి వుంటుంది. బంగారు కిరీటాన్ని ధరిం చి ఆమె తన కాలి కింద మహిషుణ్ణి తొక్కిపట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ దర్శనమిచ్చింది. సాయంత్రం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.సూర్యకుమారి ఆధ్వర్యంలో మల్లికార్జున మండపంలో జరిగిన వేద విద్వత్ సభలో వేద మంత్రోచ్ఛారణలు మార్మోగాయి. ఈ సభలో కంచి కామకోటి ఉత్తరాధికారి శ్రీవిజయేంద్ర సరస్వతిస్వామి, పారిశ్రామికవేత్త మాగంటి సుబ్రహ్మణ్యం, మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్, ఆల య స్థానాచారి విష్ణుబొట్ల శివప్రసాద్ లింగంభొట్ల దుర్గాప్రసాద్ అన్నవరం ఇవో త్రినాధ్ తదితరులు వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఇక ఇదే మండపంలో ఉద యం నుంచే సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరిస్తూ ఆహ్లాదాన్ని కల్గిస్తున్నాయి.

చిత్రం... దుర్గామాతగా పూజలందుకుంటున్న కనకదుర్గ