ఆంధ్రప్రదేశ్‌

భూసేకరణ చట్టాలు గాలికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: భూసేకరణ చట్టాలకు, నష్టపరిహారం చెల్లింపులను గాలికి వదిలేసి రైతులను బలవంతం చేసి రాష్ట్రంలో పదిలక్షల ఎకరాలతో భూమి బ్యాంకును ఏర్పాటు చేయడం దారుణమని వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఇక్కడ ఆయన లోటస్‌పాండ్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలోనే అతి పెద్ద భూమి మాఫియాకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. పదిలక్షల ఎకరాలను సేకరించిన రాష్ట్రప్రభుత్వం ఒక్క పరిశ్రమను తెచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. నిబంధనలను తుంగలో తొక్కి రైతుల నుంచి భూములను లాక్కోవడం తగదన్నారు. అమరావతిలో సారవంతమైన 34వేల ఎకరాలను బలవంతంగా తీసుకుని ఇంతవరకు ఏమి సాధించారని ప్రశ్నించారు. 90 శాతం గ్రామ ప్రజలు అంగీకరించిన తర్వాతనే నష్టపరిహారం చెల్లించి భూమిని ప్రభుత్వం సేకరించాల్సి ఉంటుందన్నారు. కాని టిడిపి నేతలు రాష్టవ్య్రాప్తంగా కృత్రిమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ధరలు పెంచేందుకు పరిశ్రమలు వస్తున్నాయంటూ రైతుల నుంచి భూములను తీసుకుంటున్నారన్నారు. భూములను కోల్పోయిన రైతులను ఫిర్యాదులు చేయవద్దని ఒత్తిడి తెస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. రాజధాని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, నెల్లూరు విమానాశ్రయం, బందర్ రేవు కోసం పెద్ద మొత్తంలోనే భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు.