తెలంగాణ

కౌనె్సలింగ్ ద్వారా ఉద్యోగుల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9:కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పౌర సరఫరాల శాఖలోని ఉద్యోగుల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ శాఖ కమిషనర్ సివి ఆనంద్ ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పౌరసరఫరాల సంస్థ, లీగల్ మెట్రాలజీ విభాగాల్లో అధికారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
సీనియారిటీ, పనితీరు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ఉద్యోగులను కేటాయించినట్టు ఆనంద్ తెలిపారు. అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో బాధ్యతలు నిర్వహించలేని పక్షంలో డిప్యూటేషన్ విధానం ద్వారా హైదరాబాద్ నుండి పని చేసే వెసులుబాటును రద్దు చేశారు. కౌన్సిలింగ్ అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కమిషనర్ ఆనంద్ మాట్లాడుతూ కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు సోమవారం తమకు నిర్దేశించిన జిల్లాల్లో రిపోర్ట్ చేయాలని దసరా రోజున ఉదయం 10.41 గంటలకు తమ కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాలకు బదిలీ చేశామని, ఇదే విధానాన్ని త్వరలో హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలోనూ వర్తింపజేయనున్నట్టు చెప్పారు. జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ముఖ్యంగా డిసిఎస్‌వో, ఎసిఎస్‌వో, మేనేజర్లు, డిఎల్‌ఎంవోలు ఎవరూ కమిషనర్ అనుమతి లేకుండా జిల్లా కేంద్రాలను విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. తమశాఖలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను 31 జిల్లాలకు సర్దుబాటు చేసినట్టు చెప్పారు. కొత్త జిల్లాల నేపథ్యంలో ధాన్యం సేకరణ, నిత్యావసర సరుకుల సరఫరా, పంపిణీకి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో ఉండే జిల్లా పౌర సరఫరాల అధికారి డిఎస్‌ఓ ఇక నుంచి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా డిసిఎస్‌వోగా, సహాయ సరఫరా అధికారి ఎఎస్‌వోను సహాయ పౌర సరఫరాల అధికారి ఎసిస్‌వోగా మారనున్నారు. ఇక నుండి పౌర సరఫరాల సంస్థ నుండి జిల్లా మేనేజర్ ఉండరు.