ఆంధ్రప్రదేశ్‌

తపాలా, టెలికం సేవలు మరింత విస్తృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: సమాచార వ్యవస్థలో ఎనె్నన్నో విప్లవాత్మక మార్పులు వచ్చి సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ నుంచి ఎన్ని పోటీలు ఎదురవుతున్నా ప్రభుత్వ తపాలా, టెలికం రంగాలకు ప్రాధాన్యం తగ్గబోదని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర విభజనలో నిన్నటివరకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ వచ్చిన పోస్టల్, టెలికం సర్కిల్స్ విడిపోయి విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్ ఏర్పాటయ్యాయి. విజయదశమి రోజున నగరంలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో తపాలా శాఖ ఎపి సర్కిల్ కార్యాలయాన్ని సిఎం చంద్రబాబు, బిఎస్‌ఎన్‌ఎల్ సర్కిల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పురాతన కాలం నాటి తపాలా కార్యాలయాలు దేశంలో ఆర్థిక సమైక్యత, సంఘటితత్వానికి తోడ్పడుతున్నాయన్నారు. 250 సంవత్సరాల క్రితం లార్డ్ క్లైవ్ ప్రారంభించిన తపాలా శాఖ సేవలు ప్రస్తుతం నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళుతున్నాయని చెప్పారు. రాష్ట్ర విభజనతో అన్ని వ్యవస్థలు విడిపోతున్నా అందరం కలిసి పనిచేద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు. తపాలా శాఖకు లాభాలు రాకపోయినా స్వయంగా నిర్వహించుకోగలిగే స్థాయికి చేరుతుండటం అభినందనీయమన్నారు. 1990 వరకు టెలిఫోన్ల వ్యాప్తి పెద్దగా లేదని, వాజపేయి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెలిఫోన్ కోసం వేచి ఉండే పరిస్థితి తప్పిందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు అనునిత్యం దగ్గరగా ఉండే విభాగాల్లో తపాలా, టెలికం శాఖలు ముందువరుసలో ఉంటాయన్నారు. దక్షిణ భారతదేశ పోస్టల్ సరకుల రవాణా కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేయటం కోసం ఐదెకరాలు, బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఏర్పాటుకు మరో ఐదెకరాల స్థలం కేటాయిస్తామంటూ ఆయన ప్రకటించారు. రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ బిఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామీణ పోస్టల్ విభాగాలను ప్రారంభించడానికి సహకరిస్తామని చెప్పారు.
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా మాట్లాడుతూ వంద శాతం ప్రభుత్వ ఈక్విటీతో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్‌ని స్థాపించే ప్రక్రియను తపాలా శాఖ చేపట్టిందని తెలిపారు. ఈ ప్రక్రియ 2017 సెప్టెంబర్ చివరికల్లా పూర్తి అవుతుందన్నారు. అప్పటికి అన్ని ఐపిపిబిలు దేశంలోని అన్ని తపాలా కార్యాలయాలతో అనుసంధానం అవుతాయని తెలిపారు. ఇప్పటికే పోస్ట్ఫాసులలో బ్యాంకింగ్ సేవలకు గాను 125 చోట్ల ఎటిఎంలను ప్రారంభించామన్నారు.
ముందుగా దివంగత ఎన్టీఆర్, ఎస్‌వి రామారావు, అల్లూరి సీతారామరాజు, ఘంటసాల వెంకటేశ్వరరావు, పింగళి వెంకయ్య, గురజాడ అప్పారావు, టిటిడి ప్రత్యేక స్టాంపులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు స్పందిస్తూ తెలుగులో ఆదికవి నన్నయ్య స్టాంపును కూడా విడుదల చేయాలని కోరారు. తొలుత ఎపి సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ ఎం సంపత్ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర టెలికం చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ్,రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపిలు కేశినేని నాని, కంభంపాటి హరిబాబు, మేయర్ కోనేరు శ్రీధర్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జలీల్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

తపాలా శాఖ, బిఎస్‌ఎన్‌ఎల్ ఎపి సర్కిల్ కార్యాలయాల ప్రారంభోత్సవం అనంతరం ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు

రికార్డు స్థాయిలో
సాగరంలోకి..
2631 టిఎంసి
గోదావరి నీరు వృథా
47 సంవత్సరాల సగటు
రికార్డును దాటిన వరద
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 12: గోదావరి ఉగ్రరూపం తగ్గలేదు. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు 2651.3 టిఎంసి నీరు ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా బంగాళాఖాతంలో కలిసింది. ఈ నెల 10వ తేదీ సోమవారం ఒక్క రోజే 4లక్షల నీరు క్యూసెక్కుల సముద్రంలో కలిసింది. గత 47 సంవత్సరాల్లో సగటున సాలీనా 2631 టిఎంసి నీరు గోదావరి నది ద్వారా సముద్రంలోకి కలుస్తోంది. ఈ ఏడాది మాత్రం 47 సంవత్సరాల సగటు రికార్డును దాటి 2651 టిఎంసి నీరు కలిసింది. ఈ ఏడాది సగటున 35 టిఎంసి నీరు ధవళేశ్వరం ద్వారా సముద్రంలో కలిసింది. 1962 నుంచి 2013 సంవత్సరం ఉన్న రికార్డులను పరిశీలిస్తే, పోలవరం దిగువున 2631 టిఎంసి నీరు ప్రతి ఏడాది సముద్రంలోకి వెళుతోంద. 2013లో జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు 5215.67 టిఎంసి నీరు కలసింది. 2010లో 3727.64 టిఎంసి నీరు, 2012లో 2784.35 టిఎంసి నీరు కలిసింది.