ఆంధ్రప్రదేశ్‌

పోలీసుల నియామకాల్లో శాస్ర్తీయత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, అక్టోబర్ 13: రాష్ట్రంలోనే తొలిసారిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి గతానికి భిన్నంగా పోలీసు శాఖలో నియామకాలు చేపట్టామని, ఇది అభ్యర్థులకు ఉపకరిస్తుందని డిజిపి నండూరి సాంబశివరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎపిఎస్‌పి 6వ పోలీసు బెటాలియన్ ప్రాంగణంలో జరుగుతున్న సబ్ ఇన్‌స్పెక్టర్స్ (కమ్యూనికేషన్), ఫింగర్‌ప్రింట్ బ్యూరోలో ఎఎస్సై పోస్టుల నియామకాలకు సంబంధించి జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలు, శరీర కొలతలు తీసే విధానాన్ని, అభ్యర్థుల డేటా ఎంట్రీ విధానాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిజిపి నండూరి మాట్లాడుతూ ఎస్సై (కమ్యూనికేషన్) 15, ఫింగర్‌ప్రింట్ బ్యూరోలో ఎఎస్సై 13 పోస్టుల నియామకానికి సంబంధించి 13వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. సుమారు ఒక్కో పోస్టుకు 482 మంది పోటీ పడుతున్నారని, వీరిలో ఇంజనీరింగ్ లాంటి ఉన్నత విద్యనభ్యసించిన వారు చాలామంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసుల నియామకంలో వినియోగిస్తున్నామని, దేశంలో ఇలా మధ్యప్రదేశ్, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో జరిగిందని తెలిపారు. ఐదో రాష్ట్రంగా ఎపి ఉందని, దక్షిణాది రాష్ట్రాల్లో ఎపీలోనే ఇలా నియామకాలు జరుపుతున్నట్లు చెప్పారు.
త్వరలో 4 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చేస్తామని డిజిపి తెలిపారు. ఎస్సై, ఎఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆరో బెటాలియన్ గ్రౌండ్‌లో 10 నిముషాల వ్యవధిలో 1.6 కి.మీల పరుగుపందెం నిర్వహించడంతో పాటు శారీరక కొలతలు కూడా తీశామని, రాష్ట్ర స్థాయిలో పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్న అతుల్‌సింగ్ ఈ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. కాగా అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని, ఆస్తులను సిఐడి గుర్తించిందని డిజిపి నండూరి చెప్పారు. ఆస్తుల అమ్మకాలు కోర్టు ఆదేశాల మేరకు జరుగుతాయని, న్యాయ సలహాలు తీసుకుని అగ్రిగోల్డ్ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని విలేఖర్ల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.