ఆంధ్రప్రదేశ్‌

డీలరు దగ్గరే రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 13 : రాష్ట్రంలో మోటారు వాహనాలు కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి, నెంబరు కేటాయించే నూతన విధానాన్ని ఈ నెల 15వ తేదీన ఏలూరులో ప్రారంభిస్తున్నట్లు రవాణా శాఖ విశాఖ డిప్యూటీ కమిషనరు, ఇ-ప్రగతి స్పెషల్ ఆఫీసర్ ఎస్ వెంకటేశ్వర్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం సాయంత్రం మోటారు వాహనాల డీలర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ అనంతరం జిల్లా డిటిసి సత్యనారాయణమూర్తితో కలిసి వెంకటేశ్వర్లు విలేఖరులతో మాట్లాడారు. వాహనం కొనుగోలుచేసిన డీలరు వద్ద నుండే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ జరిగే నూతన ప్రక్రియను గత మార్చి నుంచి ప్రయోగాత్మకంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరంతోపాటు విజయవాడలో అమలుచేస్తున్నామన్నారు.
ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసి వాహనదారులకు దళారీల బెడద లేకుండా గంటల్లో రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు ఏలూరులో రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ పారదర్శకతతో ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇ-ప్రగతి కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రవాణా శాఖ వాహనాలను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించి, వినియోగదారుడికి గంటల వ్యవధిలో నెంబరు కేటాయించే నూతన ప్రక్రియను అమలుచేస్తోందని తెలిపారు. రవాణా శాఖ ఏలూరు ఉప కమిషనర్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం గతంలో మీ-సేవా కేంద్రాలను ఆశ్రయించే వారని, దానివలన సకాలంలో ప్రభుత్వానికి సొమ్ము జమకావడంలేదని ఇకపై నేరుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేట్‌వే ద్వారా ఈ ప్రక్రియ వేగవంతమై రియల్ టైమ్‌లో సొమ్ము ప్రభుత్వానికి జమ అవుతుందన్నారు. వాహన కొనుగోలుదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఆధార్ అనుసంధానంతో క్షణాల్లో ఆన్‌లైన్‌లో క్రోడీకరించి వెంటనే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. దీనివలన వినియోగదారులు దళారీలను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదన్నారు.