ఆంధ్రప్రదేశ్‌

తిరుమల తరహాలోనే ఆలయాలు అభివృద్ధి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 13: తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో దేశంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆలయ పవిత్రతను, ప్రతిష్టను కాపాడేందుకు టిటిడి ఉన్నతమైన కృషిచేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తిరుమలపై ప్రత్యేకశ్రద్ధ వహించి అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తుండటం అభినందనీయమన్నారు. ఇదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు కృషిచేయాలని అన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి విచ్చేస్తున్న అశేష భక్తజనానికి సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు టిటిడి చేస్తున్న కృషి, సేవలు ప్రశంసనీయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తిరుమల క్షేత్రంపై ప్రత్యేక దృష్టి సారించి తరచూ ఇక్కడకు వచ్చి ఆలయం బాగోగులు భక్తులకు అందుతున్న సేవలను స్వయంగా పర్యవేక్షించడం కూడా తిరుమల అభివృద్ధికి దోహదపడ్డాయని అన్నారు. అంతకుముందు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ప్రధాన న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇ ఓ సాంబశివరావు, జె ఇ ఓ శ్రీనివాసరాజు పద్మావతి అతిథిగృహాల వద్ద పుష్పగుచ్చాలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అటు తరువాత శ్రీవారిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన వీరికి టిటిడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రధాన న్యాయమూర్తి దంపతులు, ముఖ్యమంత్రి మూలవిరాట్‌ను దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు.