ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వ్యవసాయ విశ్వవిద్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 13: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్మించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఈవిషయమై గురువారం గుంటూరులోని లాం పరిశోధనా కేంద్రంలో రూ.1506 కోట్ల అంచనాలతో నిర్మించే వ్యవసాయ విశ్వవిద్యాలయ భవన నిర్మాణాల డిజైన్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి పుల్లారావు విలేఖర్లతో మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో భవన నిర్మాణ డిజైన్లకు రూపకల్పన జరగాలన్నారు. ఈ నెల 25కల్లా డిజైన్లు అందించాలని సంబంధిత సంస్థలను ఆదేశించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన అనంతరం అత్యుత్తమ డిజైన్‌ను ఎంపిక చేస్తామన్నారు. 2018 డిసెంబరు నాటికి పూర్తిస్థాయిలో వ్యవసాయ విశ్వవిద్యాలయ భవనాల నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలోని 9 వ్యవసాయ అనుబంధ కళాశాలలను రూ. 150 కోట్ల వ్యయంతో ఆధునికీకరిస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు విక్రయించే సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇన్వాయిస్ ఉంటే సంస్థలపై, లేకుండా విక్రయిస్తే దుకాణాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం కూడా సంబంధిత కంపెనీలు చెల్లించేలా ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని తెలిపారు. సబ్సిడీపై రైతులకు అవసరమైన విత్తనాలను అందిస్తున్నామన్నారు. లాంలోని లైవ్‌స్టాక్ పరిశోధన కేంద్రం స్థలాన్ని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో విలీనం చేసి మరోచోటికి తరలిస్తామన్నారు. లైవ్‌స్టాక్ రీసెర్చి సెంటర్‌లో ఉన్న 400 ఒంగోలు జాతి గిత్తలను, ఆవులను మంత్రి పుల్లారావు పరిశీలించారు. లాం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.