ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ సమస్యపై సిఎంవో ముట్టడి: సిపిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: రాష్ట్రంలో ధన రాజకీయాలకు శ్రీకారం చుట్టింది, సంతలో పశువుల్ని కొన్నట్లు కోట్ల రూపాయలు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిలో తన కార్యాలయంలోకి ప్రవేశించిన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఎవరో ఉన్నట్లు, రాజకీయాల్ని ఎవరో దిగజార్చుతున్నట్లు, సమాజం ఏదో అయిపోతున్నట్లు, ఈయన చూస్తూ ఏమీచేయలేక బాధపడిపోతున్నట్లు పెద్ద బిల్డప్ ఇచ్చారని విమర్శించారు. అసలు రాజకీయాలను భ్రష్టుపట్టించిందీ, రాజకీయాలతో వ్యాపారం చేస్తున్నదీ చంద్రబాబేనని దుయ్యబట్టారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం గురువారం విజయవాడ హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో జరిగింది. సమావేశం అనంతరం రామకృష్ణ విలేఖర్లతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించి, తీసుకున్న నిర్ణయాలను వివరించారు. అగ్రిగోల్డ్ సంస్థ బాధితులు రాష్ట్రంలో 19.58 లక్షల మంది ఉండగా ఇతర 8 రాష్ట్రాల్లో దాదాపు 32 లక్షల మందికి పైగా వున్నారని ఆయన చెప్పారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం వారి నుండి కోట్ల రూపాయలు దోపిడీ చేసి ధీమాగా తిరుగుతుంటే చంద్రబాబు నోరు విప్పడంలేదని ధ్వజమెత్తారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే సిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని రామకృష్ణ హెచ్చరించారు.