ఆంధ్రప్రదేశ్‌

జోన్ల మధ్య నలిగిపోతున్న వాల్తేర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 13: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ రావడం మాట ఎలా ఉన్నా ఇప్పుడు వాల్తేర్ డివిజన్ మాత్రం రెండు రైల్వేజోన్ల మధ్య నలిగిపోతోంది. ఏడు వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాల్తేర్ డివిజన్‌ను వదులుకునేది లేదంటూ ఒడిశా పేచీ పెడుతోంది. జోన్ కోసం చేస్తున్న ప్రయత్నాలను ఒడిశా అడ్డుకుంటోంది. మరోపక్క వాల్తేరు డివిజన్‌తోనే కొత్త జోన్ సాధ్యపడుతుందని దక్షిణమధ్య రైల్వే చెబుతోంది. వాల్తేరు డివిజన్ లేకుండా కొత్త జోన్ ఏ విధంగా సాధ్యపడుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్, సికింద్రాబాద్ డివిజన్లు ఉన్నాయి. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పడితే వాల్తేరు, విజయవాడ, గుంటూరు డివిజన్లు ఇందులో ఉంటాయి. మిగిలిన సికింద్రాబాద్, నాందేడ్, గుంతకల్ డివిజన్లతో జోన్ ప్రత్యేకంగా ఉంటుంది. కేంద్ర ప్రణాళిక ప్రకారం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో మూడు డివిజన్లు, కొత్త జోన్ పరిధిలో మూడు డివిజన్లు ఉన్నట్టు అవుతుంది. అయితే ఒడిశా నుంచి వ్యతిరేకత లేకుండా చేయడం కోసం రాయగడను కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేసి సంబల్‌పూర్, ఖుర్దాతో మూడు డివిజన్లను కలిపి ఈస్ట్‌కోస్ట్ జోన్‌గా కొనసాగుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ విధంగా మూడు జోన్లకు సంబంధించి ప్రతిఒక్క జోన్‌లోను మూడు డివిజన్లు ఉంటాయి. సమాంతర పంపకాలతో భవిష్యత్‌లో కూడా సమస్యలు తలెత్తవు. అయితే ఇపుడు ఒడిశా వాల్తేర్ డివిజన్‌పైనే గురిపెట్టింది. ఎలాగైనా వాల్తేరును తమ వద్దనే ఉంచుకోవాలనే ప్రయత్నాలతో రాజకీయ, రైల్వేపరంగా కేంద్రంపై తీవ్ర వత్తిళ్ళు తీసుకెళ్తున్నట్టు తెలిసింది. పేరుకే తప్ప ఏమాత్రం లాభదాయకం కాని సంబల్‌పూర్, ఖుర్ధా డివిజన్లపట్ల అంతగా ఆసక్తి చూపని ఒడిశా ఇపుడు వాల్తేరు డివిజన్‌ను ప్రతిష్టగా తీసుకుంటోంది. ఈ డివిజన్లకు సంబంధించి ఈస్ట్‌కోస్ట్‌రైల్వేజోన్ హెడ్‌క్వార్టర్ భువనేశ్వర్‌లో ఉండటంతో తొలి నుంచి వాల్తేరు డివిజన్‌పై ఒడిషా పెత్తనం చెలాయిస్తూనే ఉంది. దీనిని కట్టడి చేయడం కేంద్రానికి సైతం సాధ్యపడటంలేదు. ఇదే అవకాశాన్ని కొత్త జోన్ రానీవ్వకుండా చేయగలుగుతుందంటూ డివిజన్ వర్గాలు, రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదనపు కోచ్‌లు, కొత్త రైళ్ళు, దసరా, సంక్రాంతి, వేసవి సీజన్లలో ప్రత్యేక రైళ్ళను సైతం రానీయకుండా చేయడం, పాత కోచ్‌లను వాల్తేరుకు కట్టపెట్టడంలో ఒడిశాదే పైచేయిగా నిలుస్తుంది. సరకు రవాణా, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా వార్షిక ఆదాయాన్ని ఏడు వేల కోట్లకు పెంచుకున్న వాల్తేరు డివిజన్‌పైనే ఇపుడు ఒడిశా కన్నుపడింది. ఈ ఒక్క సమస్య తీరితే ఇక కొత్త జోన్‌కు ఎటువంటి ఆటంకాలు ఉండవని అంతా భావిస్తున్నారు. భారతీయ రైల్వేకు ఆర్ధిక వెన్నుముకగా నిలిచే వాల్తేరు డివిజన్‌ను వదులుకుంటే జోన్ ప్రతిష్ఠ దిగజారే పరిస్థితులు ఒడిశాకు ఆందోళన కలిగిస్తున్నాయి.