ఆంధ్రప్రదేశ్‌

పర్యాటక రంగాభివృద్ధికి ప్రత్యేక బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 13: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ, వారసత్వ సంపదను కాపాడేందుకు ‘ఆంధ్రప్రదేశ్ టూరిజం, కల్చర్ అండ్ హెరిటేజ్ బోర్డు’ను త్వరలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వెలగపూడి నూతన సచివాలయ సముదాయంలోని తన కార్యాలయంలో రెండోరోజు గురువారం ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించారు. పర్యాటక శాఖపై జరిగిన సమీక్షలో ప్రధానంగా బోర్డు ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను బలోపేతం చేసేందుకు బోర్డు ఆవశ్యకతను అధికారులు ఆయనకు వివరించారు. ‘ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరించే టూరిజం, కల్చర్, హెరిటేజ్ బోర్డులో రాష్టస్థ్రాయి కార్యనిర్వాహక కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలు కొత్తగా ఏర్పాటు చేసే టూరిజం అథారిటీ, కల్చర్ మిషన్, హెరిటేజ్ అథారిటీని పర్యవేక్షిస్తుంటాయి. కార్యనిర్వాహక కమిటీతో పాటు వీటిలో నిపుణులను నియమిస్తారు. జిల్లా యూనిట్‌గా డిస్ట్రిక్ట్ టూరిజం అండ్ కల్చర్ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. దీనికి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. నూతనంగా ఏర్పాటు చేసే సిటీ టూరిజం అండ్ కల్చర్ కౌన్సిల్‌కు మునిసిపల్ కమిషనర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తారు’ అని అధికారులు ప్రతిపాదించారు. బోర్డు విధివిధానాలు ఖరారయితే త్వరలోనే బిల్లు రూపొందించాలని నిర్ణయించారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు, పెట్టుబడుల ఆకర్షణ, తెలుగు సంస్కృతిని పరిరక్షించేలా చర్యలు తీసుకోవటం, సంస్కృతి పరిరక్షణపై అందరిలో చైతన్యం తేవడం, వారసత్వ సంపదను భావితరాలకు అందించడం వంటివి బోర్డు విధులుగా ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. టూరిజం అథారిటీతో పాటు కల్చర్ కమిషన్, హెరిటేజ్ అథారిటీకి భారీగా నిధులు అందిస్తామని చెప్పారు. ప్రముఖ ఆలయాలను అభివృద్ధిపరచాలని, ప్రధానంగా సింహాచలం, అన్నవరం, కాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం సహా ప్రముఖ ఆలయాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్లు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి ఏటా రాజధాని ప్రాంతంలో డిసెంబర్‌లో ‘ఇంటర్నేషనల్ కల్చరల్ ఫెస్టివల్’ నిర్వహించాలన్నారు. సుమారు 20 నుంచి 25 ఎకరాల్లో తెలుగు కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా అమరావతిలో శాశ్వత వేదిక ఏర్పాటుచేసి ప్రపంచ ఉత్తమ సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దేలా విధానాలకు రూపకల్పన జరగాలన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు శ్రీకాంత్, సిఎంఒ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు.