ఆంధ్రప్రదేశ్‌

12నుంచి బాబు అమెరికా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 13: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన దాదాపు ఖరారయింది. వచ్చే నెల 12 నుంచి పదిరోజుల పాటు సాగే ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుని ఎన్నిక, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన అంశాలని తెలుస్తోంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఇతర ఉన్నతాధికారులతో కూడిన ప్రతినిధుల బృందం రాజధాని అమరావతిలో పెట్టుబడులకు సంబంధించి ఎన్నారైలు, తానా ప్రతినిధులతో చర్చిస్తారు. ఏపి అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని తానా ఇటీవలే ప్రకటించింది. రాజధానిలో వౌలిక వనరుల అభివృద్ధి, ఐటి, మానవ వనరులు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి అవగాహన కుదుర్చుకోవాలనేది పర్యటన లక్ష్యంగా చెపుతున్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌కు మద్దతిచ్చే అంశంపై ప్రవాసాంధ్రులతో ముఖ్యమంత్రి, ప్రతినిధుల బృందం భేటీ కానున్నట్లు కూడా సమాచారం.