ఆంధ్రప్రదేశ్‌

2018లో జాతీయ క్రీడల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: 2018లో జాతీయ క్రీడల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ సన్నద్ధమవుతోంది. గతంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడలను ఘనంగా నిర్వహించిన అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండేళ్ల తర్వాత జరిగే జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తుందని ప్రకటించారు. అందుకు తగ్గట్టు క్రీడల శిక్షకులను, క్రీడా ప్రాంగణాలను, హోటళ్లను, ఇతర సౌకర్యాలను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్టేడియంలను నిర్మించనున్నారు. జాతీయ స్థాయి క్రీడలకు ముందస్తుగా నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. 55 క్రీడా ప్రాంగణాలు నిర్మాణాలు మొదలయ్యాయి. ఇందుకోసం 114.37 కోట్లు వ్యయం చేస్తున్నారు. వాటిలో 24 స్టేడియంలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా, మరో 31 నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి. ఆయా స్టేడియంల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ 65 కోట్లు మంజూరు చేసింది.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారు. విద్యాధర పురంలో మల్టీపర్పస్ ఇండోర్ హబ్‌ను నిర్మిస్తారు. విశాఖలో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ నిర్మించేందుకు 17.50 కోట్లు మంజూరు చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి, నెల్లూరు జిల్లా ఉదయగిరి, కోట, చిత్తూరు జిల్లా తొట్టంబేడు, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో నాలుగేసి కోట్లతో నిర్మించనున్న ఇండోర్ హాల్స్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 కానె్సప్ట్‌తో నిధులు కేటాయించాయి. ఆయా స్డేడియంల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. కుప్పం, సామర్లకోట, తుని, కాకినాడ, కొత్తపేట, పొన్నూరు, మాచర్ల, సత్తెనపల్లి, గుంటూరు ఈస్ట్, తిరువూరు, జగ్గయ్యపేట, కర్నూలు, పత్తికొండ, నంద్యాల, అద్దంకి, ఒంగోలు, పాలకొండ, పాతపట్నం, టెక్కలి, శ్రీకాకుళం, భీమిలి, యలమంచిలి, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజంపేట, పులివెందుల, రైల్వే కోడూరు, పుట్టంపల్లి, కడప తదితర ప్రాంతాల్లోని క్రీడా ప్రాంగణాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్రీడాకారుల ఎంపిక బాధ్యత కూడా ఆయా పోటీల కోచ్‌లకు అప్పగించారు. జాతీయ క్రీడలు నిర్వహించేందుకు 74 స్టేడియంలను సిద్ధం చేస్తున్నారు.