ఆంధ్రప్రదేశ్‌

దొంగలతో క్యాషియర్ మిలాఖత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 14: చలామణి కాలం ముగిసిన నోట్లను మార్చేందుకు క్యాషియర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దొంగల ముఠా ఒక బ్యాంకుకు రూ.30 లక్షలకు టోకరా వేసింది. విశాఖలో గురువారం జరిగిన ఈ సంఘటనపై బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్యాషియర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జగదాంబ కూడలిలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సాయి సురేష్ అనే వ్యక్తి క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.
ఇతనికి కొద్ది రోజుల క్రితం ఒక ముఠాతో పరిచయం ఏర్పడింది. రిజర్వ్‌బ్యాంకు రద్దు చేసిన 500 రూపాయల నోట్లు తమ వద్ద సుమారు రూ. 5 కోట్లు వరకూ ఉన్నాయని, వీటిని మార్చితే 10 శాతం కమిషన్ ఇస్తామని ఆశ చూపారు. తొలి విడతగా రూ. 30 లక్షల నోట్లు ఇస్తామని, వీటిని మార్చిన తరువాత దఫదఫాలుగా మిగిలిన వాటిని మార్చుకోవచ్చని నమ్మబలికారు. దీంతో క్యాషియర్ సాయి సురేష్ ముఠాతో ఒప్పందానికి అంగీకరించాడు. తొలి విడత రూ.30 లక్షల సొమ్మును బ్యాంకు నుంచి బయటకు తెచ్చిన క్యాషియర్ సాయి సురేష్ ముఠాకు అప్పగించాడు. వారిచ్చిన బ్యాగ్‌ను తీసుకుని బ్యాంకుకు వెళ్ళి చూసుకోగా, పైన పేర్చిన కట్టల్లో మాత్రం పదేసి నోట్లు ఉండగా, మిగిలినవన్నీ పాత న్యూస్ పేపర్ ముక్కతో ఉన్నాయి. దీంతో క్యాషియర్ సాయి సురేష్ జరిగిన సంఘటనను ఉన్నతాధికారులకు చెప్పి బోరుమన్నాడు. అయితే, నిబంధనల మేరకు బ్యాంకు సొమ్మును దుర్వినియోగం చేసిన క్యాషియర్ సాయి సురేష్‌పై దసపల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్యాషియర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.