ఆంధ్రప్రదేశ్‌

మూడంచెలుగా స్థానిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్రంలో స్థానిక పాలనను మూడంచెల వ్యవస్థగా కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. అనుమతి రాగానే జడ్‌పిటిసి, ఎంపిటీసీల వ్యవస్థను రద్దు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. జడ్పీటిసి, ఎంపిటిసి వ్యవస్థను రద్దచేయాలని కేంద్రానికి ఏపి ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇకపై సర్పంచ్‌లే మండలాధ్యక్షులను, మండలాధ్యక్షులు జడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునే పాత పద్ధతికి మళ్లీ తెర తీయాలని యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఎంపిటిసి, జడ్పీటిసి వ్యవస్థను రద్దుచేస్తే రాష్ట్రంలో 10,148 మంది ఎంపిటిసిలు, 660 మంది జెడ్పీటిసిలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోతారు. పంచాయతీరాజ్ చైర్‌పర్సన్ పదవులకు ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ విధానంపై కొనసాగించనున్నారు. ఒకేసారి కాకుండా రెండు టర్మ్‌ల తర్వాత రొటేషన్ రిజర్వేషన్లను అమలుచేయాలని పూంచి కమిటీ సిఫార్స్ చేసింది. దీనికి ప్రభుత్వం అనుమతి తెలిపి నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘానికి అప్పగించాలని కోరింది.