ఆంధ్రప్రదేశ్‌

ఎన్టీఆర్ ఓ మహాశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడమే ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌తో పని చేసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏపి రాజధాని అమరావతిని ప్రపంచంలో మేటినగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో సిఎం చంద్రబాబు దివంగత ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు కేవలం మనిషి కాదు... ఒక వ్యవస్థ అని కొనియాడారు. దేవుళ్ల రూపంలో అందరం ఎన్టీఆర్‌ను చూసుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో 14 ఏళ్లు మాత్రమే ఉన్నారని, ఆయన రాజకీయాల్లోకి రావడమే చరిత్ర అని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఎన్టీఆర్‌తో కలిసి పని చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని గుర్తు చేసుకున్నారు. 3సమాజమే దేవాలయం.. పేదవాళ్లే దేవుళ్లని2 చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. చాలా మంది నాయకులు మాటలు చెబుతారని, పనులు చేయరని కానీ ఎన్టీఆర్ మాత్రం అనునిత్యం పేదలు, రైతులు, సమాజం గురించే ఆలోచించేవారన్నారు. చరిత్ర పురుషుడిగా, యుగ పురుషుడిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని సిఎం చంద్రబాబు గర్వంగా చెప్పారు. అగ్రవర్ణాల్లోని పేద పిల్లలను చదివిస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. దోమలపై సమరంతో డెంగ్యూ కేసులు తగ్గాయన్న చంద్రబాబు దోమల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మారుస్తామని తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, ఎంపి కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న చంద్రబాబు

మరుగుదొడ్ల
నిర్వహణకు యాప్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 15: కృష్ణా పుష్కరాల సమయంలో మరుగుదొడ్ల నిర్వహణను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఈ విధానంలో మరిన్ని పర్యవేక్షించేందుకు వీలుగా యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలు, హాస్టళ్లలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు వీలుగా ఈ యాప్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ విభాగం అభివృద్ధి చేస్తున్నది. కృష్ణా పుష్కరాల సమయంలో పరిమిత సంఖ్యలో టాయిలెట్లను పర్యవేక్షించడంలో విజయవంతం కావడంతో దీని పరిధిని రాష్టమ్రంతా విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అన్ని టాయిలెట్లను ఈ వ్యవస్థకు అనుసంధానం చేయనున్నారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి తదితర సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల 25 లక్షల రూపాయలను కేటాయించేందుకు ముందుకు వచ్చింది. దశల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, హాస్టళ్లు, ప్రజామరుగుదొడ్లకు జియో ట్యాగింగ్ చేస్తారు. ఆయా టాయిలెట్ల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించే క్షేత్ర స్థాయి అధికారి స్మార్ట్ ఫోన్‌లో ఆటోమేటిక్ టాయిలెట్ గ్రేడింగ్ సిస్టమ్ పేరుతో వ్యవహరించే యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఆ యాప్ ద్వారా సంబంధిత అధికారి కొన్ని టాయిలెట్ల ఫొటోలను మాత్రమే తీసి యాప్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపే వీలు ఉంటుంది. తేదీ, సమయం నెట్ వర్క్ ద్వారా తీసుకోవడం వల్ల పాత ఫొటోలను పంపే వీలు లేకుండా తీర్చిదిద్దుతున్నారు.