ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల హామీలు ఏమయ్యాయ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమడగూరు, అక్టోబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరవుతో విడదీయలేని బంధం ఉందని, చంద్రబాబు, కరవు అవిభక్తకవలలు లాంటి వారని పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరవు ఆయన వెన్నంటే ఉంటుందన్నారు. సోమవారం అనంతపురం జిల్లా అమడగూరు మండలంలో పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ కేంద్రమంత్రి సూర్యప్రకాశ్‌రెడ్డి రైతు భరోసా యాత్ర నిర్వహించారు. కొట్టువారిపల్లి నుండి అమడగూరు వరకు పాదయాత్ర నిర్వహించి పంటల పరిస్థితిని పరిశీలించారు. బస్టాండ్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే నాగరాజారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటి వరకు పూర్తిగా ఏ రైతుకూ రుణమాఫీ రాలేదని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకపోగా వారిని సైతం మోసం చేశారన్నారు.
ఎన్నికల హామీలో భాగంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం హామీ అమలుకు నోచుకోక చాలా గ్రామాల్లో తాగునీరు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. హంద్రీనీవా కాలువను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి జిల్లాలోని అన్ని మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీని నిలుబెట్టుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి అట్టహాసంగా రెయిన్‌గన్ ఉపయోగించి నీరందించిన గుండువారిపల్లికి చెందిన రైతు వేరుశెనగ పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. జిల్లా కేంద్రంలో నాలుగు రోజులు బస చేసిన ముఖ్యమంత్రి 4 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో వేరుశెనగ పూర్తిగా ఎండిపోయిందని, కంది పంటనయినా కాపాడి రైతులకుఊరట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
రైతుల వెన్నంటి నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒకసారి రైతులకు రుణమాఫీ చేయగా, మూడుసార్లు వడ్డీమాఫీ చేశామన్నారు. రెయిన్‌గన్ల ద్వారా 4 లక్షల ఎకరాలపంట కాపాడామని చెప్పిన చంద్రబాబు పంటల బీమా, పంట నష్టపరిహారం చెల్లించకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. గత మూడేళ్లుగా పంట నష్టపరిహారం, బీమా అందక రైతులు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో హీరో, విలన్ పాత్రలు రెండూ ముఖ్యమంత్రే పోషిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటా సత్యం, నాయకులు శ్రీ్ధర్, సుధాకర్, బాబాఫకృద్దీన్ (దేవా), నాగేంద్ర, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. అనంతపురం జిల్లా అమడగూరులో రఘువీరా, మాజీ కేంద్రమంత్రి సూర్యప్రకాశ్‌రెడ్డి రైతు భరోసా యాత్ర