ఆంధ్రప్రదేశ్‌

పేదల్లో చైతన్యం కోసమే మహాజన పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 17: పేదల శక్తి సామర్ధ్యాలను మేల్కొలపడం కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందని ప్రముఖ సామాజిక ఉద్యమ నేత, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ మనువడు డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. సోమవారం ఇబ్రహింపట్నం నియోజకవర్గం కేంద్రంలో సామాజిక న్యాయం తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పిన విదంగా చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి చెందుతుందన్న సిద్ధాంత ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రం సిద్ధించి రెండేళ్లు అయినా బడుగు, బలహీన వర్గాలు ఎలాంటి అభివృద్ధి సాధించలేదని విమర్శించారు. తాగు నీటి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల పేరుతో వేల కోట్లు ఖర్చు చేయడం కంటే ఉన్న పట్టణాలనే అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయంపైన ఆధారపడ్డ దేశ ప్రజలకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాది కల్పించాలని తెలిపారు. సిపిఎం జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సిఎం గొప్పలు చెప్పుతున్నప్పటికీ అక్షరాస్యతలో 44శాతం వెనుకబడి ఉందన్నారు. విద్యతో పాటు వైద్యం, ఆరోగ్యంలో వెనుకబడి ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 93శాతం ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నా గడిచిన రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి సాధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ మహాజన పాదయాత్రతో కెసిఆర్‌కు దడ పట్టుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దొరలు, కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. సమస్యలపై ఏలెత్తి చూపిస్తున్న వామపక్షాలను మాటిమాటికీ విమర్శించడం సిఎం కెసిఆర్‌కు అలవాటైందన్నారు. ఏళ్ల తరబడిగా కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారని, 2019 నాటికి వామపక్షాలు ప్రత్యామ్నయంగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలువలేకపోయినప్పటికీ ఓడించే శక్తి ఉందన్నారు. కెసిఆర్‌ను వ్యక్తిగతంగా కాకుండా ఆయన విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, మాజీ ఎంపి రవీంద్ర నాయక్, పౌరహక్కుల నేత రవిచంద్ర, ప్రొఫెసర్ కృష్ణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సోమవారం ఇబ్రహీంపట్నంలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్రలో పాల్గొన్న సామాజిక ఉద్యమ నేత ప్రకాశ్ అంబేద్కర్, తమ్మినేని వీరభద్రం, బి.వి రాఘవులు తదితరులు