ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సులు చదువుకోటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రెండు లక్షలతో ప్రారంభించి రూ.25లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. ఇందుకోసం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం కింద 21 మంది ఎస్సీ విద్యార్థులను 11 దేశాలకు పంపిస్తున్న సందర్భంగా వారందరితో మంత్రి రావెల సోమవారం నాడిక్కడ ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం కింద తొలుత రెండు లక్షలు సహాయం అందిస్తుండగా అవి సరిపోవటం లేదని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఇదికూడా చాలటం లేదని రూ.20 లక్షలకు పెంచామని, మరో 5లక్షలను కూడా జాతీయ బ్యాంకులు ఎస్సీ కార్పొరేషన్ హామీతో రుణంగా సమకూర్చనున్నాయని వెల్లడించారు. విద్యార్థులను తొలుత ఐదు దేశాలకే పంపుతున్నామని, దాన్ని క్రమేణా 15 దేశాలకు విస్తరింపచేశామన్నారు.
ఈ పథకం కింద ఇప్పటివరకు 190 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఎంఎస్ చేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, తదితర దేశాలకు, వైద్యవిద్య కోసం చైనా, కజికిస్తాన్, ఫిలిఫ్పైన్స్ వంటి దేశాలకు వెళ్లారన్నారు. తమ ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఏటేటా విదేశాలకు వెళ్లే ఎస్సీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరంలో రూ.33 కోట్లు కేటాయించిందని, ఇప్పటికే 16.5 కోట్లు విడుదల చేశామని మంత్రి రావెల వివరించారు.

విదేశీ విద్యాభ్యాసానికి వెళ్లే విద్యార్థులకు చెక్కు అందజేస్తున్న మంత్రి రావెల కిషోర్‌బాబు