ఆంధ్రప్రదేశ్‌

100 మున్సిపాల్టీల్లో జనరిక్ షాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్‌లో 45 వేల మంది వైద్య విద్యార్థుల క్రీయాశీలక భాగస్వామ్యంతో నవంబర్ 1న భారీ స్థాయిలో స్వాస్థ్య విద్యా వాహిని కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎపి వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎంబిబిఎస్, పిజి, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల ప్రధాన భాగస్వామ్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ఈ కార్యక్రమ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. అంటువ్యాధులు, జీవన శైలి వ్యాధులు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వ్యక్తిగత శుభ్రత, పునరుత్పత్తి, మంచి ఆహారపు అలవాట్లపై ప్రతి విద్యార్థి ఏడాదికి సగటున ఆరు రోజులపాటు స్వచ్ఛందంగా ఈ అంశాలపై ప్రచారం చేస్తారు. క్లస్టర్ విధానంలో విద్యార్థులను గ్రూపులుగా విభజించి దశలవారీగా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, డిఎమ్‌ఇ, ఎపివివిపిల పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్వహిస్తుంది. స్వయం సహాయక గ్రూపులు, డ్వాక్రా గ్రూపుల సహాయంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకు వెళ్తారు. 275 వాహనాలను ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ కేటాయిస్తుంది. వెలగపూడిలోని ఎపి కొత్త సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ విభాగాధిపతులతో మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం ఉదయం 10 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు 16 కీలక అంశాలపై తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖాపరంగా ప్రస్తుతం అమలవుతున్న విధానాలు, లోటుపాట్లు, ప్రజలకు సేవలు, భవిష్యత్‌లో సవాళ్లు వాటిని అధిగమించే చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

చిత్రం.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కామినేని శ్రీనివాస్