ఆంధ్రప్రదేశ్‌

ఇసుక వ్యాపారాలు మానండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ఇప్పటివరకూ ప్రభుత్వం, అమరావతికి నిధుల సేకరణ, అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక పార్టీపై దృష్టి సారించనున్నారు. స్థానిక సంస్థలు, రాష్ట్రంలో వైసీపీ ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేస్తుండటం, పార్టీ నేతల్లో సీరియస్‌నెస్ తగ్గిన నేపథ్యంలో ఇక పార్టీపై దృష్టి సారించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. మంగళవారం విజయవాడలో జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, మంత్రుల సమీక్ష సమావేశంలో బాబు పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. పార్టీకి సంబంధించి ఎవరైనా ఇసుక వ్యాపారాలు చేసేట్టయితే అవి మానుకోవాలని, ఇసుక పాలసీతో ప్రజల్లో వచ్చిన మంచిపేరును చెడగొడితే సహించేది లేదని, వారంలో ఇసుక వ్యాపారాలు చేసే నేతలు వాటిని మానుకోకపోతే చర్యలు తీసుకునేందుకు వెనుకాడేదిలేదని హెచ్చరించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇకపై తాను పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తానని స్పష్టం చేశారు.
నవంబర్ 1 నుంచి పార్టీ సభ్యత్వం, నియోజకవర్గాల్లో జన చైతన్య యాత్రలు ప్రారంభమవుతున్నందున ఎమ్మెల్యే, మంత్రులు దానిపై సీరియస్‌గా దృష్టి సారించాలని ఆదేశించారు. అప్పుడే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. చైతన్యయాత్రల్లో పించన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినందున ఎమ్మెల్యేలు వాటిని వినియోగించుకోవాలని ఆదేశించారు. మంత్రులు నియోజకవర్గంలో 10 రోజులు, 15రోజులు రాష్ట్రంలో, మరో 5రోజులు జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు.
కాగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత మంత్రులదేనని మరోసారి స్పష్టం చేశారు. ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లడానికి వీల్లేదని, ఆ మేరకు అక్కడి ఎమ్మెల్యే, ఇంచార్జిలతో మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ అంశాలపై వైసీపీ చేస్తున్న ఆందోళనలను అడ్డుకునేందుకు అగ్రనేతలు, మంత్రులు సీరియస్‌గా దృష్టి సారించడం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. కీలక అంశాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారని, వాటిపై బాబు దిశానిర్దేశం చేసి, తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో మునిగిపోవడం వల్ల.. పార్టీ నేతలు కూడా వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విమర్శ వినిపిస్తోంది. దీనిని గుర్తించిన బాబు పార్టీని గాడిలో పెట్టాలని భావించారని, అందుకే ప్రతిరోజు కొంత సమయాన్ని పార్టీకి కేటాయించాలని నిర్ణయించినట్లు కనిపిస్తోందని విశే్లషిస్తున్నారు. ఎమ్మెల్యేలను జనచైతన్యయాత్రల్లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. తేలిగ్గా తీసుకునే ఎమ్మెల్యేలను సహించేది లేదని, ప్రతి 3 నెలలకోసారి సర్వే చేయిస్తానని, తేడాలొస్తే సీటు ఇచ్చేది లేదని కూడా హెచ్చరించారు. ఇసుకను ఉచితంగా అందించిన విధానానికి సామాన్య, మధ్య తరగతి ప్రజానీకంలో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది. అయితే, పార్టీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్లు ఇసుక వ్యాపారం చేస్తుండటంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న సమాచారం వల్లే బాబు ఇసుక వ్యాపారం చేసే నేతలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.