ఆంధ్రప్రదేశ్‌

ఆయుర్వేద హబ్‌గా తిరుపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 18: ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి ఆయుర్వేద హబ్‌కు అన్నివిధాల అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తిరుపతి కొండల్లో ఆయుర్వేద ఔషధాలకు అవసరమైన మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆధ్యాత్మికతతో పాటు ఆయుర్వేద హబ్‌ను ఏర్పాటుచేస్తే సత్ఫలితాలు సాధించవచ్చని ఇండో స్విస్ ప్రతినిధులకు సిఎం సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఇండో స్విస్ ఆయుర్వేదిక్ ప్రతినిధులు డాక్టర్ సమైన్ హునికర్, రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్ ప్రతినిధులతో సిఎం మంగళవారం సమావేశమయ్యారు. విశాఖ కేంద్రంగా ఆయుష్ హబ్‌ను ఏర్పాటుచేస్తామని ఇండో స్విస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా తిరుపతి ఆయుర్వేద పరిశోధనలకు శ్రేయస్కరమని ప్రతిపాదించారు. తిరుపతిలో ఆయుష్ హబ్ ఏర్పాటుచేసి విశాఖ, అమరావతిలో శాఖలను విస్తృత పరచాలని సూచించారు. ఆయుర్వేద ఔషధాలలో వినియోగించే ఎర్రచందనంతో పాటు అనేక రకాల వనమూలికలు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని శేషాచలం అడవులలో లభ్యమవుతాయని, విశాఖ, అరకు ప్రాంతాల్లో కూడా వనమూలికలు ఉంటాయని చెప్తూ ఆ ప్రాంతాల్లో శాఖలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇండోస్విస్ ప్రతినిధులు తిరుపతి ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయుష్ కమిషనర్‌ను సిఎం ఆదేశించారు. సమావేశంలో సిఎం సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న, ఆయుష్ కమిషనర్ రేవతి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు