ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: వినూత్న ఆలోచన కేంద్రాలు (ఇన్నోవేషన్ సెంటర్స్), అంకుర కేంద్రాలు (ఇంక్యూబేషన్ సెంటర్స్)లలో వివిధ స్థాయిల్లో రూపుదిద్దుకున్న నూతన ఆవిష్కరణలు వాణిజ్య స్థాయికి ఎదిగి ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల్లో వినూత్న ఆలోచన కేంద్రాలు, అంకుర కేంద్రాలు ఏర్పాటుపై మార్గదర్శకాలుపై ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ బుధవారం నిర్వహించిన వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలోచనలను విస్తృత ప్రాతిపదికపై పరిశీలించి వాణిజ్యపరమైన ప్రయోజనాలు పొందేందుకు వీలుగా రాష్ట్రంలోని కాలేజీలు, విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని ఆయన కోరారు. హార్వర్డ్ యూనివర్శిటీలో మేనేజ్‌మెంట్ కోర్సు విద్యార్థులకు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు లేకుండా డిగ్రీ ప్రధానం చేయడం జరిగేదన్నారు. అదే మాదిరిగా రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్శిటీలు విద్యార్థులకు క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కారంలో వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులు రూపొందించేందుకు తగు సహాకారం అందించాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ మద్దతు ఇచ్చేందుకు పాలసీలు తీసుకురావలసిన మార్పులను వర్క్‌షాప్‌లో చర్చించి తమకు తెలపాల్సిందిగా ఆయన కోరారు. వివిధ విద్యాసంస్థల్లోని విద్యార్థులు ప్రతి నెల నాలుగవ శనివారం పూర్తిగా సామాజిక అంశాల అధ్యయనం కోసం గ్రామాలకు తరలివెళ్ళేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యువజన సర్వీసులు, క్రీడలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల పాలనా యంత్రాంగం, అధ్యాపకులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం పరచుకుని స్థానిక అవసరాలకు అనుగుణంగా వినూత్న ఆలోచనలకు అంకురార్పణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.