ఆంధ్రప్రదేశ్‌

భాషాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: తెలుగు భాషాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, ఐటి, వక్ఫ్ శాఖల మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. తెలుగు భాషాభివృద్ధి దిశగా తెలుగు ప్రాధికార సంస్థ నిర్మాణం, అకాడమీల పునరుద్ధరణ క్రమంలో తగిన సూచనల ఆహ్వానానికి మేధావులు, కళాకారులు, భాషావేత్తలతో విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ స్థాపన దిశగానే ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు భాషాభివృద్ధి కమిటీని నియమించారని చెప్పారు.
తమ కమిటీ చెన్నయి, ఢిల్లీ తదితర ప్రాంతాలలో పర్యటించి అక్కడ భాష సంస్కృతుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసిందని చెప్పారు. తెలుగువారి ఆచార సంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు అందించటానికి జిల్లాకు ఒక పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. అనంతపురంలో లేపాక్షి ఉత్సవాలు, కాకినాడలో కాకినాడ తీర ప్రాంత పండుగ, విశాఖలో విశాఖ ఉత్సవ్ తరహాలో ప్రతి జిల్లాలో వేడుకలు నిర్వహించామన్నారు. సంక్రాంతి, ఉగాది వేడుకలను రాష్ట్ర పండుగలుగా గుర్తించామని గుర్తు చేశారు. కుటుంబ వ్యవస్థలో పూర్వం ఉన్న ఆత్మీయత, ఆప్యాయతలు నేడు కరవయ్యాయన్నారు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను పాటించేలా చేస్తే కుటుంబ వ్యవస్థకు కూడా పూర్వ వైభవం తేవచ్చని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు రాసిన ‘దేశభాషలందు తెలుగు లెస్స’ పద్యాన్ని చదివారు.
మాతృభాషాభివృద్ధికి
పాటుపడుతున్న తమిళులు
శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వికీపీడియా ద్వారా తమిళులు మాతృభాషాభివృద్ధికి తోడ్పడుతున్నారని కొనియాడారు. వారిని మనం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
అంతర్జాలం నుంచి భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నారన్నారు. గతంలో తాము తెలుగు భాషాభివృద్ధికి కొన్ని చర్యలు చేపట్టామని, అయితే దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజనతో ఆ కృషికి విఘాతం ఏర్పడిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశ విదేశాల్లో ఉన్న మన కళాఖండాలను తిరిగి రాష్ట్రానికి తెప్పించే కృషి జరుగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ భాష, సంస్కృతి, కళలను కాపాడటానికి ఏం చేస్తే బాగుంటుందనే విషయంలో సూచనలు, సలహాలు ఆహ్వానించటమే సమావేశం ఏర్పాటు ఉద్దేశమన్నారు.
తమిళనాడులో తమిళులు తమ భాష, సంస్కృతుల పరిరక్షణకు స్థాపించిన వ్యవస్థలను, సంస్థలను చూశామని, ఢిల్లీలో అకాడమీలను సందర్శించామని తెలిపారు.
ఈ సమావేశంలో ఫొటోగ్రఫీ అకాడమీ అధ్యక్షుడు, సీనియర్ ఛాయా చిత్రకారుడు టి.శ్రీనివాసరెడ్డి, దక్షిణ భారత సాంస్కృతిక మండలి ప్రతినిధి కె.సత్యానందం, జనసాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి కుమార్, ప్రముఖ చిత్రకారుడు ప్రొఫెసర్ ఎస్‌వి రామారావు, రెజీనా, డాక్టర్ సామల రమేష్ బాబు, కూచిపూడి నృత్యకారుడు కె.వి.సత్యనారాయణ, చిన్నయసూరి పీఠం అధ్యక్షుడు శోభనాద్రి, రంగస్థల నటుడు బొబ్బళ్లపాటి శాయి, బివిఎం కృష్ణ, బిషప్ కాటూరి తదితరులు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఏపి శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్