ఆంధ్రప్రదేశ్‌

అన్నీ అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ ఆస్తులను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రకటించారని, ఈ వివరాలపై రాష్ట్రప్రజలకు నమ్మకంలేదని వైకాపా ధ్వజమెత్తింది. గురువారం ఇక్కడ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని తెహల్కా 13 ఏళ్ల క్రితమే ప్రకటించిందని చెప్పారు. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. ఈ ఆస్తుల వివరాలన్నీ అబద్ధాల పుట్ట అన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబు ఆదర్శంగా తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఓటుకు నోటుకేసులో పీకలలోతు కూరుకుపోయి కేంద్రం వద్ద బాబు సాగిలపడ్డారన్నారు. ఎన్నికలకు ముందు 600 హామీలు ఇచ్చి నేరవేర్చనందుకు చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన చంద్రబాబును ఎవరు నమ్ముతారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు జీవన భృతిని ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు.