ఆంధ్రప్రదేశ్‌

పోలీస్ సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 20: తీవ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోటంలో ఎపి పోలీస్ భారతదేశంలోనే అగ్రస్థానంలో వుందని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు అన్నారు. గతంలో పోలీస్ ఉన్నతాధికారులు సైతం బోగస్ నెంబర్ వాహనాల్లో మఫ్టీలో తిరుగాల్సి వచ్చేదని, తమ పిల్లలను పాఠశాలలకు పంపాలన్నా భయపడే పరిస్థితి వుండేదని ఈ నేపధ్యంలో ఉమేష్‌చంద్ర, కెఎస్ వ్యాస్, పరదేశినాయుడు, వందలాది మంది పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తీవ్రవాదులు, అసాంఘిక శక్తులతో పోరాడిన ఫలితంగానే నేడు ధీమాగా తిరుగగల్గుతున్నామన్నారు. చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో నేడు ఎలాంటి పరిస్థితులెదురవుతున్నాయో అందరూ చూస్తున్నామన్నారు. 21వ తేదీ దేశవ్యాప్తంగా జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టస్థ్రాయిలో విజయవాడలో జరిగే సభలో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కాబోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆగస్టు మాసాంతం వరకు రాష్ట్రంలో 14 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది వేర్వేరు సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అయితే అదృష్టవశాత్తు అసాంఘిక శక్తుల చేతుల్లో ఈ ఏడాది ఎలాంటి మరణాలు లేవన్నారు. ఇప్పటివరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో దివంగత పోలీస్ కుటుంబాలను రప్పించుకుని మాట్లాడటం జరిగేదని ఈదఫా తొలిసారిగా జిల్లా ఎస్‌పిల ఆధ్వర్యంలో డిఎస్‌పి స్థాయి అధికారులు నేరుగా వారి వారి నివాస గృహాల వద్దకెళ్లి వారి కుటుంబ బాగోగులు విచారించి అవసరమైతే తగు చర్యలు తీసుకోవటం జరుగుతున్నదన్నారు. ఈ వారోత్సవాల్లో నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఆధ్వర్యంలో పోలీసులకు మెగా వైద్య శిబిరం నిర్వహించగా 30 శాతం మంది పైగా బిపి, షుగర్, ఇతరత్రా పలు రకాల వ్యాధులతో బాధపడుతుండటాన్ని గుర్తించామని దీన్ని దృష్టిలో వుంచుకుని రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఏటా పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించదలచామన్నారు.
రాష్ట్రంలో 15వేల 254 మంది హోంగార్డులకు ప్రమాద బీమా పథకాన్ని విస్తరింప చేసామన్నారు. ప్రమాదంలో మరణించినా, 100 శాతం వికలాంగులైనా రెండున్నర లక్షల బీమా లభిస్తుందంటూ ఇందుకోసం ప్రభు త్వం వార్షిక బీమా ప్రీమియం కింద రూ.24 లక్షలు చెల్లిస్తున్నదన్నారు. ఈ ఏడాది 10 మంది మరణించారని అన్నారు. పోలీస్ సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని గత ఏడాది రూ.15 కోట్లు విడుదల చేసారని అన్నారు. విలేఖరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, అడిషనల్ డిజిలు ఎన్.సురేంద్రబాబు, ఆర్‌పి ఠాకూర్, ద్వారకా తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న డిజిపి సాంబశివరావు