ఆంధ్రప్రదేశ్‌

జువనైల్ హోమ్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 20: కడప నగరంలోని జువైనల్ హోమ్‌లో గురువారం తెల్లవారుజామున ఓ బాలనేరస్తుడిని సహచరుడు గొంతునులిమి చంపాడు. జిల్లాలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలు వన్‌టౌన్ సిఐ కె.రమేష్ కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. ఇద్దరు పిల్లలపై జనవరి 26న జిల్లాలోని ప్రొద్దుటూరు టుటౌన్ పోలీసుస్టేషన్‌లో దొంగతనం కేసు నమోదైంది. దీంతో వీరిద్దరినీ కడప జువైనల్ హోమ్‌కు తరలించారు. బెయిల్ విషయంలో వివాదం తలెత్తడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక బాలుడు మరో బాలుణ్ని గొంతునులిపి చంపాడు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. శవపరీక్ష నిమిత్తం ముస్త్ ఫా శవాన్ని రిమ్స్‌కు తరలించారు.

చిత్రం..హత్యకు గురైన ముస్త్ ఫా