ఆంధ్రప్రదేశ్‌

రూ. 678 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 20: రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు సాధ్యమైనంత త్వరగా ఇన్‌ఫుట్ సబ్సిడీ అందజేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. మొత్తం రూ.678 కోట్లు ఇందుకోసం కేటాయించామన్నారు. ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించారని ఆయన తెలిపారు. అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గతంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి రైతుల్ని ఆదుకున్నామన్నారు. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాకే రూ.567 కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. అలాగే ఈ ఏడాది అనంతపురం జిల్లాలోని 63 మండలాలనూ కరవు ప్రాంతాలుగా ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్షం వైకాపా చేస్తున్న ఆరోపణల్ని ప్రజలు నమ్మవద్దన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి ప్రత్తిపాటి అన్నారు. అలాగే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు కూ.277 కోట్ల పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే పంట కోతలు పూర్తయితే తప్ప పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేయలేమని అన్నారు. కాగా రైతులకు రుణమాఫీ చేసింది తామేనని, వడ్డీ కూడా ఇచ్చామని, వేరుశెనగ విత్తనాలు సబ్సిడీపై ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం విత్తన కందులు సైతం సబ్సిడీపై ఇస్తున్నామన్నారు. రెయిన్‌గన్ల వల్ల ఉపయోగం లేదని రైతులు వాపోతున్నారంటూ విలేకరులు మంత్రి దృష్టికి తీసుకురాగా, పది రోజులు ఆలస్యంగా రెయిన్‌గన్ల ద్వారా రక్షక తడులు ప్రారంభించామన్నారు.